ఒకుహరపై సింధు విజయం

264
0
SHARE


ఇంటర్నెట్‌డెస్క్‌: కొరియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌లో భారత స్టార్‌, తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించింది. ఆదివారం రసవత్తరంగా సాగిన ఫైనల్‌ పోరుతో జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరపై సింధు 22-20, 11-21, 21-18తో గెలుపొందింది. కొరియా ఓపెన్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. సింధు గెలుపుపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు.

* ‘22ఏళ్ల వయసులోనే పీవీ సింధు ఓ లెజెండ్‌గా మారిపోయింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. కంగ్రాట్స్‌ సింధు.’ – మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌
* ‘బ్రిలియంట్‌ గేమ్‌. అభినందనలు సింధు. నిన్ను చూసి భారత్‌ గర్వపడుతోంది. ఇక నీ విజయాలను ఎవరూ ఆపలేరు.’ – కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌
* ‘కంగ్రాట్స్‌ సింధు.. మరోసారి త్రివర్ణ పతాకం ఎత్తున ఎగిరేలా చేశావు. ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం ఇది.’ – ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
* ‘యాహూ సింధు నిరూపించింది. కొరియా ఓపెన్‌ సాధించిన తొలి భారత క్రీడాకారిణి సింధు. స్వీట్‌ రివేంజ్‌.’ – బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌
* ‘తాను ఓడించగలను అని నమ్మింది. ఓడించి చూపించింది. భారత్‌ గర్వపడుతోంది సింధు. కంగ్రాట్స్‌.’ – బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌
* ‘కంగ్రాట్స్‌ సింధు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.’ – మలయాళీ నటుడు మోహన్‌లాల్‌
* ‘నీపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసినందుకు థాంక్యూ సింధు. నువ్వు వారియర్‌వి.’ – పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా
* ‘కంగ్రాట్స్‌ సింధు. యావత్‌ భారతం గర్విస్తోంది.’ – కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌
* ‘వాట్‌ ఏ ఛాంపియన్‌.. ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్‌ను దక్కించుకుంది.’ – మహ్మద్‌ కైఫ్‌
* ‘సింధు గొప్ప ప్రత్యర్థిగా ఎదుగుతోంది. టైటిల్‌ సాధించినందుకు కంగ్రాట్స్‌.’ – మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here