కొరియా ఓపెన్ ఫైనల్ : పీ వీ సింధు ఘన విజయం

136
0
SHARE

న్యూఢిల్లీ : తెలుగు తేజం పీ వీ సింధు జపాన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహారపై తీయని ప్రతీకారం తీర్చుకుంది. సియోల్‌లో ఆదివారం జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ వుమెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో ఘన విజయం సాధించింది. వీరిద్దరూ ఏడుసార్లు తలపడ్డారు. నాలుగుసార్లు ఒకుహార గెలిచింది. ఇటీవలే వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సింధును ఒకుహార ఓడించింది. సింధు దీనికి ప్రతీకారం తీర్చుకుంది. కొరియా ఓపెన్‌ సిరీస్‌లో విజయం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. విజేతకు 6 లక్షల డాలర్లు బహుమతి లభిస్తుంది.

ఆదివారం సియోల్‌లోని ఎస్ కే హ్యాండ్‌బాల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెట్‌ను పీ వీ సింధు తన ప్రత్యర్థి నొజోమీ ఒకుహరాపై 22-20 తేడాతో గెలిచింది. రెండో సెట్‌లో హోరాహోరీ పోరు జరిగింది. దీనిలో 21-11 తేడాతో ఒకుహర గెలిచింది. మూడో సెట్‌లో పీ వీ సింధు 21-18 స్కోరుతో విజయం సాధించింది. స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here