అది వారి వల్లే జరిగింది.. మహేష్ బాబు ట్వీట్‌కు ప్రధాని రిప్లై వైరల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 17). ఇక ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశం నలుమూలల నుంచి విషెస్ వెల్లువెత్తాయి. సినీ రాజకీయ వ్యాపార రంగాల్లోని ప్రముఖులంతా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సాధారణ ప్రజలు, నెటిజన్లు సైతం ప్రధానికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక ప్రధానికి విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున పలకరిస్తూ రిప్లై ఇస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు చెప్పిన విషెస్‌కు, చేసిన ట్వీట్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

మహేష్ బాబు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ… మన గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోదీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. మీకు గల అసాధారణ నాయకత్వ లక్షణాలతో మన ఇండియాను అన్ని రంగాల్లో ముందు నిలిపారు. మీకు ఆయురారోగ్యాలు, సంతోషాలు కలగాలి అంటూ కోరుకున్నాడు. ఇక మహేష్ చెప్పిన మాటలకు ఎంతో వినయంతో సమాధానమిచ్చారు మోదీ.

Narendra Modi Reply To Mahesh Babu About His Birthday Wishes

మహేష్ బాబు ట్వీట్‌కు నరేంద్ర మోదీ స్పందిస్తూ.. ఇండియాలో వచ్చిన మార్పులు.. మన భారతీయ పౌరుల వల్లే వచ్చింది. వారి మద్దతు ద్వారానే సాధించాను. వారికి సేవ చేస్తుండటం నాకు కలిగిన గొప్ప అదృష్టం, అది గౌరవం. బర్త్ డే విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్ మహేష్ అని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మోదీ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0