అనిల్ రావిపూడి చేతుల మీదుగా ”నటన సూత్రధారి” మోషన్ పోస్టర్ రిలీజ్

‘అమృతరామమ్’ వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించిన చిత్ర
బృందం నుంచి ‘నటన సూత్రధారి’ పేరుతో మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది.
పద్మజ ఫిలింస్ పతాకంపై ఎస్ఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అమృత రామమ్ సినిమాతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్
కొంటాడి ‘నటన సూత్రధారి’ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అమిత
రంగనాథ్, సుశీల్ మాధవపెద్ది జంటగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రలను
ఛరిష్మా శ్రీకర్, ఆకాష్ రాథోర్, కిషోర్ మారిశెట్టి పోషిస్తున్నారు. ‘నటన
సూత్రధారి’ సినిమా మోషన్ పోస్టర్ ను సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్
రావిపూడి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ బాగుందని, సినిమా మంచి విజయం
సాధించాలని చిత్ర బృందానికి విశెస్ తెలియజేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ కొంటాడి మాట్లాడుతూ…మా సినిమా మోషన్
పోస్టర్ అనిల్ రావిపూడి గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఇదొక కొత్త
తరహా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. నటన సూత్రధారి సినిమా షూటింగ్ గత నెల 13న
ప్రారంభించాం. 30 రోజులు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇంకో వారం రోజులు
చిత్రీకరణ చేస్తే సినిమా పూర్తవుతుంది. డిసెంబర్ చివరి నాటికి ఫస్ట్
కాపీతో సిద్ధంగా ఉంటాం. అన్నారు.

‘నటన సూత్రధారి’ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా సాగింది. అశోక చక్రంలోని
నాలుగు సింహాల చిహ్నం, ఎన్ కౌంటర్, జస్టిస్ ఫర్ రేప్ విక్టిమ్, యామిని
లైఫ్ స్టోరీ, మహాత్మా గాంధీ చిత్రపటం కనిపిస్తున్నాయి. నటన సూత్రధారి
టైటిల్ కింద భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ‘ఏకం సత్ విప్ర బహుదా
వదంతి’ అంటే ‘ఎన్ని పేర్లతో పిలిచినా దేవుడు ఒక్కడే’ లేదా ‘సత్యం ఒక్కటే’
అనే వాక్యం రాశారు.

అమిత రంగనాథ్, సుశీల్ మాధవపెద్ది,నివాస్ వర్మ, కౌటిల్య నటించిన ఈ
సినిమాకు సినిమాటోగ్రఫీ – సంతోష్ షానమోని, ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్,
సంగీతం – ఎన్ ఎస్ ప్రసు, ఆర్ట్ డైరెక్టర్ – ఉపేందర్ రెడ్డి, లైన్
ప్రొడ్యూసర్స్ – రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్, పీఆర్వో –
జి.ఎస్.కె మీడియా
రచన-దర్శకత్వం: సురేందర్ కొంటాడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares