అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం: భారీగా ఎగసిపడుతున్న మంటలు

అన్నపూర్ణా స్టూడియోలో మరోసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడిన దృష్బ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అకస్మాత్తుగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి అనేక రకాల అనుమానాలు వైరల్ అవుతున్న తరుణంలో వెంటనే అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం వివరణ ఇచ్చింది. అనుకోకుండా మంటలు ఎగసిపడడంతో అనుకోకుండా మంటలు ఎగసిపడడంతో అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ కు ఎలాంటి చరిత్ర ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హైదరాబాద్ లోని అతిపెద్ద స్టూడియోలలో ఒకటైన ఈ సంస్థలో రోజుకు పదుల సంఖ్యలో షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇక బిగెస్ట్ రియాలిటీషోలు చాలా వరకు ఇక్కడే జరుగుతుంటాయి. అయితే సడన్ గా మంటలు ఎగసిపడడంతో అంతా షాక్ కి గురయ్యారు. ప్రమాదం వెనుక అసలు కారణం ఇదే.. ప్రమాదం వెనుక అసలు కారణం ఇదే.. ఒక సినిమా షూటింగ్ కోసం వేసిన భారీ సెట్ లో షార్ట్ సర్క్యూట్ కావడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు యాజమాన్యం వివరణ ఇచ్చింది. మొదట ఒక రియాలిటీ షో కోసం వేసిన సెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు రూమర్స్ రాగా వెంటనే స్టూడియో యాజమాన్యం వివరం ఇస్తూ.. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సినిమా సెట్ లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బిగ్ బాస్ హౌజ్ వద్దనే ప్రమాదం బిగ్ బాస్ హౌజ్ వద్దనే ప్రమాదం ఇక ఆస్తినష్టం కూడా పెద్దగా జరగలేదని అందులో పని చేస్తున్న వారు మీడియాకు తెలిపారు. అయితే అన్నపూర్ణ స్టూడియోలో ఇలాంటి ప్రమాదాలు జరగడం మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అనేక రకాలుగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అప్పట్లో కొన్ని ఘటనల వెనుక అనుమానాలు కూడా వచ్చాయి. ఇక బిగ్ బాస్ హౌజ్ కూడా ఘటన జరిగిన సమీపంలోనే అంది. అయితే బిగ్ బాస్ హౌజ్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా నిర్వాహకులు తెలిపారు. రెండేళ్ల క్రితం మనం సెట్‌లో రెండేళ్ల క్రితం మనం సెట్‌లో రెండేళ్ల క్రితం మనం సినిమా కోసం నిర్మించిన సెట్ కూడా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లో అక్కడే ఎక్కువగా ఉండేవారు. అయితే ఆ సెట్ ని అలాగే నాన్న గారి గుర్తుగా ఉంచుకోవాలని అనుకున్నారు నాగార్జున. కానీ అనుకోకుండా ప్రమాదానికి గురవ్వడంతో సెట్ పూర్తిగా బుడిదయ్యింది. ఇక ఇప్పుడు మరో ప్రమాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares