అమిత్ షా సంచలన వ్యాఖ్యలు… మమతా బెనర్జీకి షాక్


అమిత్ షా సడెన్‌గా ట్విస్టులు ఇస్తుంటారు. ఉండుండి సంచలన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఆయన అన్న మాటలు పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారితీశాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా చెప్పిన చాలా విషయాలు జరిగి తీరాయి. ఇప్పుడు ఆయన స్థానంలో జేపీ నడ్డా వచ్చినా… ప్రస్తుతం హోంమంత్రిగా ఉంటూ కూడా అమిత్ షా… ఇదివరకటిలాగే… రాజకీయాలపై సంచలన కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆయన బెంగాల్ పై చేసిన కామెంట్ కలకలం రేపింది. వచ్చే ఏడాది బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని షా అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన… అందుకే తమకు అవకాశం ఇస్తారని నమ్మకంతో చెప్పారు.

ఎడిటర్ ఇన్-చీఫ్ రాహుల్ జ్యోషితో… ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా… ఈ వ్యాఖ్య చేశారు. “మేం ఎన్నికల్లో గట్టిగా పోరాడతాం. నాకు నమ్మకం ఉంది బెంగాల్‌లో మార్పు వస్తుంది. నరేంద్ర మోదీ సారధ్యంలో… నెక్ట్స్ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతంది” అని షా అన్నారు.

మరి బెంగాల్‌లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా… “అది సాధ్యమే. అంతకంటే ముందు బెంగాల్ ప్రజలు తృణమూల్ కాంగ్రెస్‌తో విసిగిపోయారు. అది ఇప్పుడు కీలక అంశం” అని షా చెప్పారు.

“బెంగాల్ ఎన్నికల్లో అవినీతి, అంఫన్ తుఫానే మా అజెండా. అంఫన్ తుఫాను సమయంలో… మేం పంపిన రిలీఫ్ ఫండ్ మొత్తం పక్కదారి పట్టింది. నిధుల పంపిణీలో అవినీతిపై పెద్ద ఎత్తున కంప్లైంట్లు వస్తున్నాయి. మొత్తం రిలీఫ్ ఫండ్ అవినీతి పరుల చేతుల్లోకి వెళ్లింది” అన్న అమిత్ షా… కరోనాను కంట్రోల్ చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అన్నారు.

గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్‌లో 42 ఎంపీ స్థానాల్లో బీజేపీ 18 గెలుచుకుంది. 40 శాతం ఓటు షేర్ కలిగివుంది. అందువల్ల బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీకి ప్రత్యర్థిగా ఉంది. అటు మమతా బెనర్జీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి విషయంలోనూ వ్యతిరేకంగా ఉంటున్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుగా థియేటర్లను తెరచి… కేంద్రంతో తాము కలిసి సాగేది లేదనే సంకేతాలిచ్చారు. అందువల్ల బెంగాల్‌లో తృణమూల్, బీజేపీ మధ్య వార్ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0