ఇబ్బందికరంగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం, వైద్యులు ఏం చెప్తున్నారు?

ఐదు రోజుల కిందట సీనియర్ రాజశేఖర్ తనతో పాటు భార్య జీవిత ఇద్దరు కూతుళ్లు శివానీ, శివాత్మికలకు కరోనావైరస్ బారిన పడ్డట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. శివాని శివాత్మిక ఇద్దరూ కరోనా నుంచి కోలుకోగా.. తను జీవిత ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు రాజశేఖర్ తెలిపారు. అయితే రాజశేఖర్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్లు తాజాగా ఆయన చిన్నకూతురు శివాత్మిక గురువారం ట్విట్టర్లో వెల్లడించడంతో టాలీవుడ్లో ఆందోళన నెలకొంది.
మరోవైపు రాజశేఖర్ అభిమానులు కూడా కంగారుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్న సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేసింది. రాజశేఖర్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించిన ఆ ఆస్పత్రి.. ఆయనను వెంటిలేటర్ పైన ఉంచినట్లు తెలిపింది.

ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ వుండి శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నపుడు పెట్టే నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్‌ను ప్రస్తుతం రాజశేఖర్‌కు అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఆస్పత్రి హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. మరోవైపు రాజశేఖర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని క్షేమంగా తిరిగిరావాలని చిరంజీవి ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares