ఈ ఎన్నికలు న్యాయమైనవని అంగీకరించండి.. : బుష్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాలు వచ్చినా..వాటిని రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించలేకపోతున్నారు. తాను ఓటమి చెందానన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ మరోమారు పునురుద్ఘాటించారు. కాగా, నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టే జో బైడెన్‌, కమలా హారీస్‌లు విల్మింగ్టన్‌ వేదికగా సోమవారం ప్రజలనుద్దేశించి ప్రసంగించే అవకాశాలున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి కూరుకుపోయిన అమెరికాను బయటపడేసేందుకు..కరోనా వైరస్‌పై పోరు అంశాలపై బైడెన్‌ ప్రస్తావించే అవకాశాలున్నాయి. అదేవిధంగా బిల్డ్‌ బ్యాక్‌ బెటర్‌.కామ్‌, ట్రాన్సిషన్‌ 46 వంటి వెబ్‌సైట్లు ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్లలో నాలుగు ఆసక్తికర అంశాలను పొందుపరిచారు. ఆర్థిక పునరుద్ధరణ, కోవిడ్‌-19, జాతి సమానత్వం, వాతావరణ మార్పులు గురించి పేర్కొన్నారు. అదేవిధంగా కరోనా పోరు సిద్ధం చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అంశంపై కూడా చర్చించవచ్చునని తెలుస్తోంది.
కోర్టుకు ట్రంప్‌
శనివారం ఫలితాలపై అందరూ ఉత్కంఠతో ఉంటే..ట్రంప్‌ మాత్రం కూల్‌గా గోల్ఫ్‌ ఆడుకునేందుకు వెళ్లారు. ఫలితాలు వెలువడినప్పటికీ.. మా ప్రధాన మీడియా తదుపరి అధ్యక్షుడు ఎవరూ అన్నదీ చెప్పాకే తాను నమ్ముతానంటూ ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. కాగా, సోమవారం ఈ ఫలితాలపై ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. పౌర హక్కులతో పాటు ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర చట్టాలను ఉల్లంఘించారంటూ పెన్సిల్వేనియా కోర్టులో దావా వేయనున్నట్లు స్థానిక మీడియా చెబుతుంది. ఈ ఎన్నికల్లో మోసాలు జరిగాయనడానికి తమ వద్ద సాక్ష్యాలున్నాయని ఆయన తరుపు న్యాయవాది చెప్పారు. మిచిగాన్‌, జార్జియా కోర్టుల్లో కూడా పిటిషన్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

అంగీకరించండి.. : బుష్‌
ఈ ఎన్నికలు న్యాయమైనవని, అమెరికన్‌ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారంటూ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత జార్జ్‌ బుష్‌ పేర్కొన్నారు. వారిద్దరినీ అభినందించేందుకు బైడెన్‌, కమలా హారీస్‌ను పిలిచానని చెప్పారు. ప్రజలు విశ్వసించి..వీరికి ఓట్లు వేశారని చెప్పారు. దేశం, కుటుంబం, పొరుగుదేశాలు..భవిష్యత్తు కోసం దేశప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని బుష్‌ పేర్కొన్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0