ఉల్లి తినని వాళ్లు అదృష్టవంతులంట.. సోషల్ మీడియాలో జోకులే.. జోకులు


పెరుగుతున్న ఉల్లి ధరలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. #OnionPrice ట్యాగ్ ట్రెండింగ్ మారింది. కొందరు నెటిజన్లు పెరిగిన ఆనియన్ ధరలతో జైనిజం ఫాలో అవుతామంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఉల్లి తినని వాళ్లు అదృష్టవంతులంట.. సోషల్ మీడియాలో జోకులే.. జోకులు

ప్రస్తుతం దేశ ప్రజలకు కరోనా కేసులు పెరగడంతో పాటు ఉల్లి ధరలు పెరగడం సైతం ఆందోళన కలిగిస్తోంది. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో పాటు ఉల్లి సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది. ఇది కూడా ధరలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉల్లి ధర కేజీ రూ. 50 నుంచి రూ. 100 వరకు పలుకడం సామన్యుడికి ఆందోళన కలిగించే అంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఇది రూ. 120 నుంచి 150 వరకు వెళ్తుందన్న ప్రచారం సైతం సాగుతోంది. హోల్‌సేల్ మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లిధర రూ. 2000 వరకు పెరిగింది. గత సోమవారం నాసిక్‌లోని లాసల్‌గంజ్ మార్కెట్‌లో ఉల్లి ధర క్వింటాల్‌కు రూ. 7100 వరకు వెళ్లింది. ఈ ధర ఇంకా పెరిగితే.. దేశంలోని రీటైల్ మార్కెట్‌లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ఉల్లి ధరలపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. #OnionPrice ట్యాగ్ ట్రెండింగ్ మారింది. కొందరు నెటిజన్లు పెరిగిన ఆనియన్ ధరలతో జైనిజం ఫాలో అవుతామంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఆనియన్లు పెరిగినందుకు ఏడుస్తున్నట్లు కొందరు ఫొటో పెట్టగా.. నేను ఉల్లి తినను అంటూ నవ్వుతు కాలు మీద కాలు వేసుకున్నట్లు ఫొటోలు అత్యధికంగా షేర్ అవుతున్నాయి. ఆనియన్ పెట్రోల్ ధరలను పోల్చుతూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి ఫొటోలతో పలుపురు పెట్టే కామెంట్లు నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తున్నాయి. బాహుబలిలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకున్న ఫొటోను మార్ఫింగ్ చేసి ఉల్లిగడ్డ ఎత్తుకున్నట్లుగా మార్చి షేర్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో ప్రస్తుతం ఉల్లి ధర రూ. 51కి చేరగా.. కోల్‌కతాలో కిలోకు రూ. 65, ముంబైలో రూ. 67 పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలను దిగుమతి చేసుకునే నిబంధనలను కాస్త సడలించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెలలో ఉల్లిపాయల ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares