ఊర్మిలకు ఓ పోర్న్‌స్టార్ : కంగనా షాకింగ్ కామెంట్స్


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేపథ్యంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడు లేని విధంగా అనేక రకాల వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కంగనా రనౌత్ కి సంబంధించిన కామెంట్స్ టీవీ చర్చల నుంచి పార్లమెంట్ చర్చల వరకు వెళుతున్నాయు. కంగనా చేస్తున్న కామెంట్స్ ప్రతీ ఒక్కరిని షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక ఇటీవల ఆమె ఆమె జయా బచ్చన్ పై అలాగే ఊర్మిల మంతోద్కర్‌పై కూడా ఘాటుగా కౌంటర్లు వేయడం మరో కాంట్రావర్సీకి దారి తీసింది.

జయబచ్చన్ పై సీరియస్
ఇటీవల జయబచ్చన్ కంగనాపై ఇన్ డైరెక్ట్ గా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎవరో ఒకరు తప్పుచేస్తే బాలీవుడ్‌లో ప్రతీ ఒక్కరిని నిందించడం భావ్యం కాదని కొందరు పనికిమాలిన వాళ్ళు కావాలని బాలీవుడ్ పై నిందలు వేస్తున్నట్లు జయా బచ్చన్ ఆరోపణలు చేశారు. అందుకు కంగనా సీరియస్ అయ్యింది.

హీరోతో పడుకుంటూనే..
ఈ సినిమా వరల్డ్ లో నేను లేడి ఓరియెంటెడ్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాను. దేశభక్తి మహిళ విలువలను పెంచే సినిమాలు కూడా చేశాను. ఈ సినిమా పరిశ్రమ గురించి చాల గొప్పగా చెబుతున్నారు. కానీ ఇక్కడ చాలా వరకు ఒక ఐటెమ్ సాంగ్ లో అవకాశం కోసం అలాగే రెండు నిమిషాల పాత్ర కోసమైనా హీరోతో పడుకునే దుస్థితి ఏర్పడింది అని కంగన ఘాటుగా స్పందించారు.

అలాంటిది జయా బచ్చన్ ఈ ఇండస్ట్రీకి ఏం నేర్పించారు. హీరోతో గడిపితెనే అవకశాలు ఇవ్వడమా? అని కంగనా తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కంగనా కామెంట్స్ పై సీనియర్ నటి ఊర్మిల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నోరు ఉందని ఇష్టం ఉన్నట్లుగా అర్థం లేకుండా వాగడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని కౌంటర్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares