ఎర్రచీర మేకింగ్ వీడియో విడుదల

డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమన్ బాబు, కారుణ్య చౌదరి లు జంటగా నటిస్తూ శ్రీరామ్, కమల్ కామరాజు వంటి ప్రధాన నటీనటులతో తెరకెక్కుతున్న చిత్రం ఎర్ర చీర. మరో ఇంట్రెస్టింగ్ కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర మేకింగ్ వీడియో ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిందని, ఆ సాంగ్ కూడా చిత్రకరించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ఫినిష్ చేసి 2021 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేద్దాం అనే ఆలోచనతో ఉన్నాం అని తెలిపారు. ఆలీ, బేబీ సాయి తేజేస్విని, భద్రం, రంగస్థలం మహేష్, అన్నపూర్ణమ్మ, అజయ్ వంటి తదితర భారీ తారాగణం నటిస్తున్న
ఈ సినిమాకు మాటలు గోపి విమలపుత్ర, కథ స్క్రిన్ ప్లే దర్శకత్వం సి హేచ్ సత్య సుమన్ బాబు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0