ఎస్పీ బాలు అంత్యక్రియలకు ముఖం చాటేస్తారా? మీకు టైం వస్తుంది.. టాలీవుడ్‌పై శ్రీరెడ్డి ఫైర్

ప్రఖ్యాత గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు తెలుగు సినీ హీరో, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులెవరూ హాజరుకాకపోవడం వివాదంగా మారింది. ఎస్పీ బాలుకు శ్రద్దాంజలి ఘటించడానికి ఎవరూ రాకపోవడంపై శ్రీరెడ్డి తప్పుపట్టారు. తెలుగు సినిమా పరిశ్రమపై ఏ ఒక్కరు రాకపోవడంపై తీవ్రంగా దుయ్యబట్టారు. అగ్ర నటులను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేయడం మరో వివాదంగా మారింది. శ్రీరెడ్డి ఏమన్నారంటే.. తెలుగు పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు తెలుగు పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు తెలుగు సినీ పరిశ్రమకు మూలస్తంభమైన ఎస్పీ బాలు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఎస్పీ బాలు మరణం తర్వాత ట్వీట్లు చేస్తూ మొసలి కన్నీరు కార్చారు. కానీ తెలుగు పరిశ్రమ తరఫున ఏ ఒక్కరు కూడా అంత్యక్రియలకు హాజరుకాకపోవడంపై శ్రీరెడ్డి ధ్వజమెత్తారు. తాను ఎస్పీ బాలు అంత్యక్రియలకు హాజరయ్యాను. కానీ తెలుగు నటిగా కాదు.. తమిళ పరిశ్రమ తరపున హాజరయ్యాను అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ స్పందించదా? మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ స్పందించదా? తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఎస్పీ బాలు అంత్యక్రియలకు తెలుగు పరిశ్రమ నుంచి ఏ ఒక్కరు కూడా రాకపోవడం విషాదకరం. ఆయన గాయకుడే కాకుండా స్వతహాగా నటుడు, నిర్మాత కూడా. అలాంటి వ్యక్తికి కనీసం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నుంచి కనీసం ఏ ఒక్కరు కూడా రాకూడదా? ఎంతో మంది హీరో, హీరోయిన్లకు జీవితాన్ని ఇచ్చిన గొప్ప గాయకుడిని ఎవరూ పట్టించుకోలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ఎక్కడున్నా వస్తుంది… కరోనా ఎక్కడున్నా వస్తుంది… కరోనావైరస్ వంకతో ఎస్పీ బాలు అంత్యక్రియలకు ముఖం చాటేశారు. మీ సినిమా ప్రమోషన్లు, మీ కొడుకులు, కూతుళ్ల సినిమా ప్రమోషన్ల బీజీగా ఉన్నారు. కరోనా ఒక్క తమిళనాడులో ఉందా? కరోనా మీ గుమ్మంలో కూడా ఉంది. గొప్ప గాయకుడి చివరిచూపు కోసం ప్రత్యేక విమానం వేసుకొని రాకుడదా అని శ్రీరెడ్డి ప్రశ్నించారు. స్టేజీలు, సన్మానాల కోసం గొడవలు స్టేజీలు, సన్మానాల కోసం గొడవలు తెలుగు సినిమా ప్రముఖులు స్టేజ్‌ల మీద గొడవ పెట్టుకోవడానికి చేతనవుతుంది. చిన్న విషయాలకు పోట్లాడుకోవడానికి సమయం ఉంటుంది. తెలుగు ప్రముఖులమని అవార్డుల కోసం వెంపర్లాడుతారు. కానీ ఓ గొప్ప వ్యక్తి మరణిస్తే చివరిచూపుకు వచ్చే ప్రయత్నం చేయరా? స్టేజ్‌లు, శాలువాలు కప్పుకోవడానికి కొట్టుకొంటారు. బాలు లేకుంటే మెగాస్టార్లు, ఇతర స్టార్లు కాలేరు. అలాంటి వ్యక్తికి టాలీవుడ్ ముఖం చాటేశారు.
ఎస్పీ బాలు అంత్యక్రియల సమయంలో చెన్నైలో టాలీవుడ్ పరువు పోయింది. ఏ ఒక్కరు కూడా రాకపోవడంపై సిగ్గుపడుతున్నారు. పెద్ద పెద్ద వ్యక్తులు మరణిస్తే వారి చావులకు వెళుతారు కానీ ఎస్పీ బాలు చనిపోతే రారా? మీ దృష్టిలో బాలు అంటే అంత చిన్నచూపా? మీరు మరణించే రోజు వస్తుంది. కరోనా బయటకు వస్తేనే కాదు. ఇంట్లో ఉన్నా వస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వీడియోలో దారుణంగా కామెంట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares