ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌పై మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నిర్వహణపై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Election) నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలకు స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరని మంత్రి అన్నారు. నిమ్మగడ్డ రమేష్‌కు(Nimmagadda Ramesh Kumar) రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని విమర్శించారు.
ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని అన్నారు. కోవిడ్ తీవ్రత ఉన్నా బుద్ది, జ్ఞానం లేకుండా నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన అవివేకానికి నిదర్శనమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబులు ఇద్దరు కలిసి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తు ఊరుకోదని హెచ్చరించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించం కుదరదనే మాట వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాల్లోకి కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కు లేఖ రాశారు