ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

సీఎం జగన్ నిర్ణయంతో మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు నిరీక్షణకు తెరపడనుంది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్లకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అందించారు. ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీచర్ల బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారు. టీచర్ల బదిలీలపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ నిర్ణయంతో మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు నిరీక్షణకు తెరపడనుంది.
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు మళ్లీ ప్రారంభయ్యే నాటికి వాటిలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చేందుకు జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిపై సమీక్షలు నిర్వహిస్తోంది. నాడు నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలని భావించింది. ఈ క్రమంలోనే ఇటీవల ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలతో పాటు బ్యాగులు వంటి వాటిని చేర్చుతూ జగన్న విద్యాకానుక కిట్‌ను అందజేసింది ఏపీ ప్రభుత్వం.
పాఠశాలలను తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం వదిలేయడంతో…నవంబర్ తొలివారంలో పాఠశాలలను పునర్ ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాథ్యాయుల బదిలీలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు