ఏపీ, తమిళనాడు భేష్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఇదివరకు రోజుకు 10 వేల వరకు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 6 వేలకు చేరుకుంది. అయితే కరోనా నియంత్రణలో కూడా ఏపీలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కేసుల తీవ్రత తగ్గుతోందని వెల్లడించారు. ఇటు మరణాల సంఖ్య కూడా తగ్గింది. వైరస్ సోకిన వారికి దాదాపు అందరికీ వేగంగా తగ్గుతోంది. అయితే ఏపీతోపాటు తమిళనాడు కూడా కరోనా వైరస్ నియంత్రణలో భేష్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీ తెలిపింది. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దేశంలో కరోనా వైరస్ సోకిన మరణాల శాతం ఏపీలో తక్కువగా ఉందన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్ విధానం వల్లే ఇది సాధ్యమైందని విజయసాయిరెడ్డి వివరించారు. ఇందుకోసం సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో చేస్తున్నప్పటికీ.. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో కొత్త కరోనా కేసులు, మరణాలసంఖ్య కూడా క్రమంగా తగ్గుతూనే ఉంది. కోలుకుంటున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇదీ ఊరటనిచ్చే అంశం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నిన్నటి వరకు 7,19,256 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది.