ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన నిర్మాత అశ్వినీదత్‌

ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ల్యాండ్‌కు సంబంధించి నష్టపరిహారం కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.గతంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణ కోసం.. అశ్వినీదత్‌ సుమారు 40 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూసమీకరణ కింద అశ్వినీదత్‌ భూమినిచ్చారు. దీనికి బదులుగా ప్రభుత్వం సీఆర్డీయే పరిథిలో అశ్వినీదత్‌కు భూకేటాయింపు జరిపింది. ఐతే.. ఇప్పుడు సీఆర్డీయే పరిథి నుంచి రాజధానిని ప్రభుత్వం తప్పించడంతో.. ఆ భూమికి విలువ పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. అగ్రిమెంట్‌ ఉల్లంఘించారంటూ అశ్వినీదత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్‌పోర్ట్‌ విస్తరణను వెంటనే ఆపేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తానిచ్చిన భూమి తిరిగి ఇవ్వాలని.. లేకుంటే భూసేకరణ కింద.. నాలుగు రెట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. నాలుగు రెట్ల నష్టపరిహారం కింద అశ్వినీదత్‌.. 210 కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0