ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసిన కరాటే కళ్యాణి .

బిగ్ బాస్ సీజన్ 4 లో మొదటి రెండు వారాలు హౌస్ లో సందడి చేసిన కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల డిక్లరేషన్ టాపిక్ పలు వివాదాలకు కారణం అయిన నేపథ్యంలో, ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు తాజాగా దుమారం రేపాయి. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన కరాటే కళ్యాణి తిరుమల డిక్లరేషన్ విషయంలో సీఎం జగన్ తప్పు చేశారు అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కొడాలి నానీ దిష్టిబొమ్మ దగ్ధం … నానీ హిందువైనా డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఫైర్ తిరుమల రూల్స్ బ్రేక్ చేసే హక్కు ఎవరికీ లేదన్న కరాటే కళ్యాణి తిరుమల రూల్స్ బ్రేక్ చేసే హక్కు ఎవరికీ లేదన్న కరాటే కళ్యాణి ఆయన సీఎం కావచ్చు… పీఎం కావచ్చు, తిరుమల రూల్స్ బ్రేక్ చేసే హక్కు లేదని పేర్కొన్న కరాటే కళ్యాణి ప్రశ్నించడం తనహక్కు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ తెలుసు అని ఆయన సీఎం అయిన కారణంగా ఎవరూ ఆపలేరని తిరుమలకి వెళ్ళారా అంటూ ప్రశ్నించారు కరాటే కళ్యాణి. అంతేకాదు భారత పౌరులుగా ప్రశ్నించడం తమ హక్కని ఆమె సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు . బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నిబంధనలకు కట్టుబడి ఉండాలని, అన్ని మతాలను గౌరవించాలి అని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు ? తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు ? జెరూసలేం వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అడిగితే ఇస్తారు కదా… అలాగే తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు కరాటే కళ్యాణి. వైయస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని, ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా చేయడం తప్పు అని విమర్శించారు కరాటే కళ్యాణి. ఏపీలో వైఎస్ జగన్ పాలనలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఎవరికి వాళ్లు రూల్స్ పెట్టుకుంటే అంతకు ముందు ఉన్న రూల్స్ బ్రేక్ చేసినట్టే కదా అంటూ ఆమె పేర్కొన్నారు.

బీజేపీలో చేరనున్నట్టు తెలిపిన కరాటే కళ్యాణి బీజేపీలో చేరనున్నట్టు తెలిపిన కరాటే కళ్యాణి సీఎం హిందువుగా మారారని, గంగలో మునిగారని , స్వరూపానందేంద్ర ఆయన్ను హిందువుగా మార్చారని ఫోటోలలో చూశానని చెప్పారు. కానీ ఆయన ఇంట్లో అన్ని కార్యక్రమాల్లో ప్రార్ధనలు చేస్తారని అన్నారు. నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తా అంటే ప్రజలకు ఏమి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటూ కరాటే కళ్యాణి ప్రశ్నించారు. అంతేకాదు తన రాజకీయ ఆరంగేట్రం గురించి కూడా సంచలన విషయాన్ని వెల్లడించారు కరాటే కళ్యాణి .త్వరలోనే తాను బీజేపీలో చేరుతానని అని ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత అన్ని అంశాలపై స్పందిస్తానని కరాటే కళ్యాణి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares