కీర్తిసురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ లిరికల్‌ వీడియో

లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’ అంటూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్‌ ‘మిస్‌ ఇండియా’ లిరికల్‌ వీడియో సాంగ్‌
“పచ్చిపచ్చి మట్టి జల్లె పుట్టుకొచ్చె ఈవేళ గడ్డిపోచ గజ్జెకట్టి దుంకులాడే ఈ నేలగట్టుదాటి పల్లె తేటి పాటే కట్టి పుంఖంలాపట్టలేని పోలికలోన పడుచునవ్వె తుమ్మెదలామా లచ్చ గుమ్మాగుమ్మాడిరా ఓ గోగుల గుంగాడి రా.. ఈ తుమ్మెర కొప్పున సన్నజాజి నవ్వేరా…” 
అంటూ ఓ అమ్మాయి తన లక్ష్యం గురించి ఎలా కలగందో అందంగా పాట రూపంలో వివరించింది ‘మిస్‌ ఇండియా’ యూనిట్‌. బుధవారం ఈ సినిమా నుండి మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీత సారథ్యంలో ‘లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’  లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఫోక్‌ సాంగ్‌ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్ నటించిన చిత్రం ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన ‘మిస్‌ ఇండియా’ నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్‌ 4న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ సినిమా విడుదలవుతుంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. 
నటీనటులు:
కీర్తి సురేశ్‌, జగపతిబాబు, నదియా, రాజేంద్ర ప్రసాద్‌, వీకే నరేష్‌, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు

సాంకేతిక వర్గం:
నిర్మాత: మహేశ్‌ ఎస్‌.కొనేరు, దర్శకత్వం:  వై.నరేంద్రనాథ్‌ రచయితలు:  తరుణ్‌ కుమార్‌, వై.నరేంద్రనాథ్‌స్క్రీన్‌ప్లే:  వై.నరేంద్రనాథ్‌సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0