కుల్‌భూషణ్ కేసులో కీలక నిర్ణయం – పార్లమెంటులో రచ్చ – ఆంక్షల భయం

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విషయంలో దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను రివ్యూ చేయాలని, ఆమేరకు అతనికి న్యాయ సహకారం అందేలా చూడాలని అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) ఆదేశించడంతో విధిలేని పరిస్థితితుల్లో పాక్ ముందడుగు వేసింది. దీనిపై జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)లో తీవ్రవాదోపవాదాలు నడిచాయి. చివరికి.. ఏపీలో కోరానా: గుడ్‌న్యూస్ – భారీగా తగ్గిన మరణాలు – రికవరీలో దేశంలోనే టాప్ – కొత్తగా 3,620 కేసులు కుల్‌భూషణ్ జాదవ్ కు ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించే బిల్లుకు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు చేసిన సిఫార్సులను సభ ఆమోదించిందని, తద్వారా తన మరణశిక్షను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కుల్‌భూషణ్ కు లభించిందని పాక్ సర్కారు వెల్లడించింది. Pak Assembly panel approves bill for review of Kulbhushan Jadhavs conviction నిజానికి జాదవ్ కు న్యాయ సహాయం అందించాలని ఐసీజే గతేడాదే తీర్పు చెప్పినా.. ఆ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తూ పాక్ డ్రామాలాడింది. జాదవ్ ను కలవనీయకుండా లాయర్లను అడ్డుకుంది. దీంతో భారత్ మరోసారి ఐసీజేను ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఈకేసులో అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను పాటించకపోతే పలురకాల ఆంక్షలు ఎదుర్కోనే పరిస్థితి నెలకొనడంతో పాక్ ఎట్టకేలకు జాదవ్ బిల్లును ఆమోదించింది. కాగా, జాదవ్ కు మరణశిక్షను సవాలు చేసుకునే అవకాశం కల్పించడంపై పాక్ జాతీయ అసెంబ్లీలో రచ్చ చెలరేగింది. ప్రతిపక్ష ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, జామాయత్‌ ఉలేమా-ఈ-ఇస్లాం సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే ఓటింగ్ సమయంలో అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు చాకచక్యంగా వ్యవహరించడంతో బిల్లుకు ఆమోదం లభించింది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0