ఖుష్బూ: కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సినీ నటి-

ప్రముఖ నటి, తమిళనాడు కాంగ్రెస్ నేత ఖుష్బూ సుందర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అంతకు ముందే ఆమెను పార్టీ ప్రతినిధి పదవి నుంచి తొలగిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

ఏఐసీసీ ప్రతినిధి పదవి నుంచి ఆమె తొలగింపు తక్షణం అమలులోకి వస్తుందని కాంగ్రెస్‌ సమాచార వ్యవహారాల ప్రతినిధి ప్రణబ్‌ ఝా ప్రకటించారు.

రాజీనామాకు ముందు ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న సమయంలో తాను కాంగ్రెస్‌లోకి వచ్చానని గుర్తు చేశారు.

పేరు, డబ్బు కోసం పార్టీలోకి రాలేదని, పై స్థాయిలోని కొందరు వ్యక్తులకు గ్రౌండ్‌ రియాలిటీలు తెలియవని ఆమె అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి పార్టీలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె తన లేఖలో ఆరోపించారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల నుంచి తాను స్ఫూర్తి పొందుతానని, సోనియాగాంధీకి ఆరాధకురాలినని ఖుష్బూ తరచూ చెప్పేవారు. తన కుటుంబానికి, కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని ఆమె అనేవారు. పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ను కాంగ్రెస్‌తోనే మొదలు పెడతానని గతంలో ప్రకటించిన ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
ఖుష్బూకు బీజేపీ కండువా కప్పుతున్న పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares