చైనా వ్యూహం అట్టర్ ఫ్లాప్.. రిస్క్ చేసిన జిన్‌పింగ్!


భారత్‌తో ఘర్షణలకు దిగి ప్రయోజనం సాధించలన్న చైనా వ్యూహం బెడిసి కొట్టింది. జిన్‌పింగ్ భవిష్యత్తును రిస్క్ చేసినా ఫలితం దక్కలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్ సరిహద్దుల్లో సైనిక బలగాలను మోహరించిన చైనా.. క్రమంగా ఎల్‌ఏసీని దాటుకొని వచ్చేందుకు ప్రయత్నించింది. కానీ భారత బలగాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో తోక ముడిచింది. గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు చనిపోగా.. పీఎల్ఏకు చెందిన 60 మంది సైనికులు చనిపోయారని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కూడా చైనా బలగాలను మోహరిస్తుండటంతో.. భారత్ దూకుడు పెంచింది. ఇండియన్ ఆర్మీ దూకుడుగా ముందుకెళ్తూ.. వ్యూహాత్మక పర్వత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది.

భారత్ తేలిగ్గా తలొంచుతుందని భావించిన చైనా ఈ పరిణామాలతో బిత్తరపోయింది. ఇప్పటికీ ఎల్ఏసీ వెంబడి భారీగా బలగాలను మోహరిస్తూ.. భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. డ్రాగన్ దాడులను తిప్పికొట్టేందుకు భారత సైన్యం కూడా సర్వసన్నద్ధంగా ఉంది. బీజింగ్ ఊహించని స్థాయిలో ఇండియన్ ఆర్మీ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది.

భారత్‌తో ఘర్షణల కారణంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. జిన్‌పింగ్ తన భవిష్యత్తును రిస్క్‌లో పెట్టి మరీ ఎల్ఏసీ వెంబడి ఘర్షణలకు దిగాడని.. న్యూస్ వీక్‌లో గోర్డాన్ జీ చాంగ్ అనే కామెంటేటర్ అభిప్రాయపడ్డారు. చైనా బలగాలు భారత్‌లోకి దూకుడుగా దూసుకెళ్లాలన్న వ్యూహం అనూహ్య రీతిలో ఫ్లాప్ అయ్యిందని గోర్డాన్ తెలిపారు.

ఎల్ఎసీ వెండి చైనా సైన్యం విఫలం కావడంతో.. జిన్‌పింగ్ సైనిక దళాల్లో మార్పులు చేపట్టే అవకాశం ఉందన్నారు. ఈ వైఫల్యాల కారణంగా మరోసారి భారత్‌ను చైనా సైన్యం టార్గెట్ చేసే అవకాశం ఉందన్నారు.

జిన్‌పింగ్ 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితుడైన తర్వాతి నుంచి చైనా బలగాలు తరచుగా భారత భూభాగంలోకి చొచ్చుకొస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన భారత్.. దూకుడు పెంచింది. శత్రువుకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడటం ప్రారంభించింది. దీంతో జిన్‌పింగ్ ఇప్పుడు ఒత్తిడిలో పడిపోయారు. విజయం కోసం లడఖ్ ఘర్షణలను పెంచడానికే ఆయన చూస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0