ట్రంప్ గౌరవంగా తప్పుకోవాలన్న మెలానియా ట్రంప్

అమెరికా అధ్యక్ష ఫలితాల్లో ఘోర పరాభం చవిచూసిన డొనాల్డ్ ట్రంప్ ఆ పదవి నుండి గౌరవంగా తప్పుకోవాలన్న జాబితాలో తాజాగా ఆ దేశ మొదటి మహిళ, ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కూడా చేరారు. తాజా ఎన్నికల ఫలితాలపై బహిరంగంగా ఆమె ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ…. సన్నిహితుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారని సమాచారం. ఆమె కూడా ట్రంప్ హుందాగా వ్యవహరించాలని భావించినట్లు తెలుస్తోంది. గౌరవ ప్రదంగా నిష్క్రమించాలని…లేదంటే చరిత్రలో చెడ్డపేరు మిగులుతుందని హితవు పలికే వారిలో ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారుడు జారేడ్ కుష్నర్ కూడా ఉన్నారు. ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ వాటిని ఆమోదించాలని సూచించారు. ఓటమిని అంగీకరించాలని చెప్పారు. అయినప్పటికీ మొంకి పట్టు వీడని ట్రంప్ ఓటమిని అంగీకరించేందుకు ససేమీరా అంటున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, న్యాయపోరాటానికి దిగుతానని చెప్పారు. ఈ విషయంలో ట్రంప్ కుమారులు కూడా ఆయనకే వంత పాడుతున్నారని తెలుస్తోంది