ట్విట్టర్‌కు భారత్‌ హెచ్చరిక


న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతమైన లఢఖ్‌లోని లేహ్ నగరాన్ని చైనాలో భాగంగా చూపిస్తున్న ట్విట్టర్‌ లొకేషన్‌ సెట్టింగ్‌లపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయుల మనోభావాలను గౌరవించండంటూ సంస్థను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల జాతీయ భద్రతా విశ్లేషకులు నితిన్‌ గోఖలే లేహ్లోని అమర వీరుల చిహ్నమైన హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ నుండి ట్విట్టర్‌ వేదికగా ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వీడియోలో లొకేషన్‌ ట్యాగ్‌ చైనాలో దర్శనమిచ్చింది. భారత్‌ భూభాగాన్ని తప్పుగా చూపించడాన్ని నిరసిస్తూ ట్విట్టర్‌ సిఇఒ జాక్‌ డోర్సేకు.. ఎలక్ట్రానిక్స్‌, ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లు సమాచారం. భారత సమగ్రత, సార్వభౌమత్వాన్ని అగౌరవపర్చడం ఏ మాత్రం సమంజసం కాదని, చివరికీ మ్యాపుల్లో అయినా సహించలేమని, అలా చేయడం చట్టవిరుద్ధం కూడా అని పేర్కొంది. అలాంటి తీరు ట్విటర్‌కు అపఖ్యాతిని తీసుకురావడంతో పాటు..పలు ప్రశ్నలు తలెత్తె అవకాశాలున్నాయని..ఈ చర్యను ఖండిస్తున్నామంటూ లేఖ ద్వారా తెలిపింది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0