తమన్నాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ… హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిక –

సినీ నటి తమన్నా భాటియాకు కోవిడ్-19 సోకినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. తమన్నా ఓ వెబ్ సిరీస్ చిత్రీకరణ కోసం కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో ఉన్నారు. రెండు రోజుల కిందట కరోనావైరస్ లక్షణాలు కనిపించటంతో పరీక్ష చేయించుకున్నారు. కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తమన్నాకు కరోనా సోకిందనే విషయం తెలియగానే ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్నారు.

తమన్నా తల్లిదండ్రులు సంతోష్ భాటియా, రజని భాటియాలకు ఆగస్టులో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ సమయంలో తమన్నా టెస్టు నెగెటివ్ వచ్చింది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares