తిరుపతిలో దారుణం.. యువతిని రేప్ చేసిన పాస్టర్..!


తిరుపతిలోదారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు రేప్ చేశాడు.

తిరుపతిలోదారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతిపై ఓ పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు రేప్ చేశాడు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన బాధితురాలి తల్లి కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు దిశా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు స్పందన కార్యక్రమంలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. బాధితురాలి తల్లి మీడియాకు తెలిపిన వివరాలు.. “తిరుపతిలో ఉండే పాస్టర్ దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రోడక్ట్ కంపెనీలో గత నెల 4వ తేదీన మా పెద్దకుమార్తె(బాధితురాలు) పనికి చేరింది.

అయితే ఈ నెల 3వ తేదీన దేవసహాయం కారులో వచ్చి.. సరకు డెలివరీ ఇవ్వాలని.. మా పెద్ద అమ్మాయిని తీసుకెళ్లాడు. అలా చెప్పి తీసుకెళ్లి రేణిగుంట రోడ్డులోని తుకివాకం గ్రామ సమీపంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు. అమ్మాయి ఇంటికి వచ్చాక తమకు ఈ ఘోరం గురించి తెలిసింది. దీంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాం. దిశ పోలీస్ స్టేషన్‌కు వెళితే.. వాళ్లతో మీరు పోరాటం చేయలేరని అన్నారు. మా అమ్మాయిని వేరే పని చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో మేము స్పందన కార్యక్రమం ద్వారా ఈ నేరాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం” అని చెప్పారు. ఇంకా, స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదును అదనపు ఎస్పీ సుప్రజ.. గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పంపారు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి.. బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పలువురు విపక్ష నాయకులు పరామర్శించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా టీడీపీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహయాదవ్‌తో పాటుగా, టీఎన్‌ఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ శ్రేణులు ధర్నాకు దిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *