తైవాన్‌పై కన్నేసిన చైనా… యుద్ధానికి సిద్ధం?…


కుళ్లు కుతంత్రాల చైనా… తన చుట్టూ ఉండే దేశాలను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. అన్నీ అరాచకాలే. తాజాగా తైవాన్‌పై దండెత్తేందుకు దరువేస్తోంది. ఇలాగైతే ఎలా?

పక్కలో బల్లెం అంటారే… అందుకు చైనా కరెక్టు ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. పక్కలో బల్లెం (గునపం లాంటిది) ఉంటే ఏమవుతుంది… ఏదో ఒక సమయంలో అది గుచ్చుకుంటుంది. చైనా కూడా అంతే… ఎప్పటికైనా పక్క దేశాలకు ప్రమాదమే. ఈమధ్యేగా ఇండియాతో లఢక్‌లో ఘర్షణకు దిగింది… మన సైన్యం 20 మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికీ ఆ గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా తైవాన్‌పై ఉరుముతోంది. యుద్ధానికి సిద్ధం కండి… అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తన సైన్యంతో అంటే… అది ఇండియాతోనేమో అని అనుకున్నారు చాలా మంది. తాజాగా తెలిసిందేంటంటే… తైవాన్‌తో అని. అసలు తైవాన్ ఎక్కడ… చైనా ఎక్కడ. మ్యాప్‌లో చూడండి… ఇండియాకి శ్రీలంక ఎలాగో… చైనాకి తైవాన్ అలాగ. చాలా చిన్నగా ఉంటుంది. ఏదో సముద్రంలో అలా తేలుతూ… తన పనేదో తాను చేసుకుంటోంది. అలాంటి అమాయక దేశంపై పిచుకపై బ్రహ్మాస్త్రంలా రెచ్చిపోవాలనుకుంటోంది డ్రాగన్.

చైనా ఏం చైస్తోంది:

తైవాన్ పై మిలిటరీ చర్యకు చైనా దిగబోతోందని వార్తలొస్తున్నాయి. మిలిటరీ చర్య అంటే… యుద్ధం కిందే లెక్క. తన కుట్ర కోసం చైనా ఆగ్నేయ తీరంలో భారీగా ఆయుధాలను, సైనిక బలగాలను మోహరిస్తోంది. ముఖ్యంగా సరికొత్తగా తయారుచేసిన DF 17 క్షిపణుల్ని అక్కడ రెడీ చేసింది. అవి మామూలువి కావు. హైపర్ సోనిక్ వేగంతో వెళ్తాయి. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధిస్తాయి.

తైవానే ఎందుకు?:
కొండ ముందు రాయి లాంటి చిన్న దేశమైన తైవాన్ ను తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలన్నది చైనా కుట్ర. తైవాన్ దేశమే కాదనీ… అది తమ భూభాగమేనని చాలా కాలంగా వాగుతోంది. యాక్షన్ తీసుకుంటామని ఇదివరకు చాలాసార్లు జిన్ పింగ్ నుంచి వార్నింగులు వెళ్లాయి. ఐతే… అంతర్జాతీయ చట్టాలు, ఐక్య రాజ్య సమితి లాంటివి తమను కాపాడతాయని తైైవాన్ ఆశలు పెట్టుకుంటూ అలా జీవిస్తోంది. కానీ… ఇప్పుడు జిన్ పింగ్ కి టైమ్ బాలేదు. చైనాలో ఆయనపై వ్యతిరేకత బాగా ఎక్కువైంది. ఇలాంటి ఏదైనా యుద్ధం చేయడం ద్వారా… ప్రజల్లో భయం కలిగించాలని స్కెచ్ వేసినట్లున్నాడని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

దుర్భుద్ధి చైనా:
జిత్తుల మారి నక్క కూడా చైనాను చూసి ఆశ్చర్యపోతుందేమో… తన కంటే కన్నింగ్ ఫెలో చైనాలో ఉన్నాడని అనుకుంటుందేమో అని మనకు అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా ఆర్థిక పరిస్థితి బాలేదు. నిరుద్యోగం బాగా పెరిగింది. కరోనా వచ్చాక… ప్రపంచ దేశాలన్నీ చైైనాని దూరం పెడుతున్నాయి. చైనాలోని విదేశీ కంపెనీలు ఇండియాతో పాటూ ఇతర దేశాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. అందుకే జిన్ పింగ్ కి ఈర్ష్యా ధ్వేషాలు బాగా పెరిగిపోతున్నాయి. ఫలితంగానే ఇలాంటి దుశ్చర్యలు.సైనిక చర్య జరిగితే ఏమవుతుంది?:
చైనా యుద్ధం చేస్తే… ప్రపంచ దేశాలు, ఐరాస వంటివి ఖండించే ప్రకటనలు చేస్తాయి, అలాగే చైనాపై కొన్ని అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తాయి. తైవాన్ కి మద్దతుగా అమెరికా లాంటి దేశాలు నిలుస్తున్నాయి. ఏం చేసినా చైనాను పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టం. ఇప్పటికే చైనా తన చుట్టూ ఉన్న హాంకాంగ్, భూటాన్ లాంటి దేశాలను తన కంట్రోల్ లో పెట్టుకొంది. దీనిపై చాలా కాలంగా విమర్శలు, ఖండించడాలూ చూస్తున్నాం. కానీ ఏ అంతర్జాతీయ సంస్థా… ఆయా దేశాలను డ్రాగన్ నుంచి విడిపించి స్వేచ్ఛను ఇవ్వలేకపోయాయి. తైవాన్ ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటే… ఇక అక్కడ భారీగా ఆయుధాల్ని మోహరించి… దక్షిణ చైనా సముద్రంపై మరింత పట్టును పెంచుకోవచ్చని జిన్ పింగ్ కుట్రలు పన్నుతున్నాడేమో.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0