త్రిపాఠి జోరు.. చెన్నై సూపర్ కింగ్స్‌ ఓటమి


అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పరుగుల తేడాతో సూపర్ కింగ్స్‌పై గెలుపోదింది.
అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పరుగుల తేడాతో గెలుపోదింది. చెన్నై గెలిచే స్థితిలో ఉండి చేజేతులా ఓటమి పాలైంది. వాట్సన్ ఉన్నంత వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్ అతని నిష్క్రమణ తర్వాత కొల్‌కతా చేతుల్లోకి వెళ్ళిపోయింది.

కేకేఆర్ నిర్ధేశించిన 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే డుప్లెసిస్‌(17) వికెట్‌ను త్వరగానే కొల్పోయింది. గత మ్యాచ్‌ల్లో సూపర్ బ్యాటింగ్‌తో ఆదరగొట్టిన డుప్లెసిస్‌ (17; 10 బంతుల్లో 3×4) కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (40 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) హఫ్ సెంచరీ చేసి నరైన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంబటి రాయుడు (30; 27 బంతుల్లో 3×4) పర్వాలేదనిపించాడు. ధోనీ(11) మరోసారి నిరాశపరిచాడు. చివరకు సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి‌ (81; 51 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. కోల్‌కతా 37 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన నాలుగో ఓవర్‌ రెండో బంతికి శుబ్‌మన్‌ గిల్‌ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్‌ రాణాతో కలసి రాహుల్‌ త్రిపాఠి‌ స్కోర్‌ను పరిగెత్తించాడు. అప్పుడే కుదురుకుంటున్న నితీష్‌ను కరణ్‌ శర్మ బొల్తా కొట్టించాడు. సునీల్‌ నరైన్(17),ఇయాన్‌ మోర్గాన్(7) స్వల్ఫ స్కోర్‌కే ఔటయ్యారు. రసెల్‌, కమిన్స్‌, కార్తీక్‌ మరోసారి నిరాశపరిచారు. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకూర్‌, కరణ్‌ శర్మ,శామ్‌ కర్జన్‌ రెండు వికెట్లు తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares