దీపావళి ‘ఢ’మాల్..! ఏపీలోనూ టపాసుల విక్రయంపై బ్యాన్


కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దీపావళికి టపాసుల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలూ జారీ అయినట్టు సమాచారం.

దేశంలోని పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాల మాదిరిగానే.. ఏపీ ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకొంది. దీపావళికి రాష్ట్రంలో టపాసుల విక్రయాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటం.. కాలుష్యం వల్ల అది మరింత పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. దేశంలో ఇదివరకే పలు రాష్ట్రాలు బాణాసంచ పేలుళ్లపై నిషేధం విధిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, కర్నాటక వంటి రాష్ట్రాలు ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు కూడా జారి చేసిన విషయం తెలిసిందే.

ఇటీవలే జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా బాణసంచా వాడకాన్ని నిషేధించింది. తాజాగా ఆ జాబితాలో ఏపీ కూడా చేరింది. కరోనా భూతంతో దీపావళి టపాసుల విక్రయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు టపాసుల వ్యాపారాలకు ఎలాంటి అనుమతులూ (తాత్కాలికం కూడా) ఇవ్వరాదని మండలాల్లో తహశీల్దార్ లకు మౌఖికంగా ఫోన్లులో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

దీపావళి పండుగను ఇంటి వద్ద పూజలు పిండి వంటలకే పరిమితం చేసుకోవాలని సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టపాసుల వ్యాపారాలకు విక్రయాలకు పూర్తిగా బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు. పిల్లలకు ఎంతో ఆసక్తికరమైన క్రాకర్స్ విక్రయాలు నిలిపివేయడం పండుగ ఉత్సాహంతో ఉన్న వారి ఆశలపై నీళ్లు చల్లారని పలువరు చెబుతున్నారు. ఈ కారణంగా మరోవైపు అక్రమ వ్యాపారంతో టపాసుల ధరలు ప్రజలకు పూర్తిగా భారమయ్యే అవకాశాలున్నాయని జనాలు లబోదిబోమంటున్నారు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0