దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు: ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు

దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం మొదలైంది. మరికొన్ని గంటల్లో ఫలితం తేలనుంది. జిల్లా కేంద్రం సిద్దిపేట దగ్గర్లోని ఇందూరు కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కో రౌండుల అభ్యర్థుల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి.
13వ రౌండు

ఈ రౌండు వరకు లెక్కించిన మొత్తం 96,522 ఓట్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 39,265 ఓట్లు లభించాయి.

టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపోట సుజాతకు వచ్చిన ఓట్లు: 35,539

కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి 11,874 ఓట్లు వచ్చాయి.

ఈనెల 3వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 82.61 శాతం పోలింగుతో, ఒక లక్షా 64 వేల 192 ఓట్లు నమోదు అయ్యాయి. మొత్తం 23 మంది పోటీ పడగా, ప్రధాన పోటీ టిఆర్ఎస్ అభ్యర్థి, ఇటీవలే మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన రావు, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చెఱకు ముత్యం రెడ్డి కుమారుడు, ఇటీవలే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారిన చెఱకు శ్రీనివాస రెడ్డిల మధ్యే ఉంది.

సాధారణంగా ఎవరైనా సిట్టింగ్ సభ్యులు చనిపోయి, వారి కుటుంబ సభ్యులే పోటీలో ఉంటే పోరు అంత గట్టిగా ఉండదు. సానుభూతి కార్డు ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో గతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగిన తరహాలో దుబ్బాక ఎన్నిక కూడా హోరాహోరీగా జరిగింది. టిఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర వివాదాలు ఏర్పడ్డాయి. బీజేపీకి సంబంధించినదన్న అభియోగంతో పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకున్నారు.

మొత్తం 315 పోలింగ్ కేంద్రాల మెషీన్లతో పాటూ, పోస్టల్ బ్యాలెట్ లెక్కించాల్సి ఉంది. ఈసారి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, కోవిడ్ పాజిటివ్ ఉన్న కొందరికీ, 80 ఏళ్లు దాటిన వృద్ధులు కొందరికి కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు

దుబ్బాక మరో ప్రత్యేక, అది కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుంది. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్, హరీశ్ నియోజకవర్గం సిద్దిపేట, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల – ఈ మూడూ దుబ్బాక సరిహద్దులే, దుబ్బాకకు మూడు వైపులా విస్తరించి ఉన్నాయి. పద్మా దేవేందర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న మెదక్, దుబ్బాకకు మరోవైపు ఉంటుంది.

2009 ఫలితాలు:

మొత్తం పడ్డ ఓట్లు -1,42,535

కాంగ్రెస్ – చెఱకు ముత్యం రెడ్డి – 52,989, 37.18 శాతం

టిఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 50,349, 35.32 శాతం

ప్రజారాజ్యం – మద్దుల నాగేశ్వర రెడ్డి – 19,942

కాంగ్రెస్ మెజార్టీ 2,640 ఓట్లు

2014 ఫలితాలు:

మొత్తం పడ్డ ఓట్లు -1,52,564

టిఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 82,231, 53.37 శాతం

కాంగ్రెస్ – చెఱకు ముత్యం రెడ్డి – 44,306, 28.75 శాతం

బీజేపీ – మాధవనేని రఘునందన రావు – 15,133, 9.82 శాతం

టిఆర్ఎస్ మెజార్టీ 37,925 ఓట్లు

2018 ఫలితాలు:

మొత్తం పడ్డ ఓట్లు -1,63,401

టిఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 89,299, 54.36 శాతం

కాంగ్రెస్ – మద్దుల నాగేశ్వర రెడ్డి – 26,799, 16.31 శాతం

బీజేపీ – మాధవనేని రఘునందన రావు – 22,595 13.75 శాతం

టిఆర్ఎస్ మెజార్టీ 62,500 ఓట్లు

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0