నటుడుగా కె.రాఘవేంద్ర రావు – సరసన ముగ్గురు హీరోయిన్లు


తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ దర్శకుల్లో కె.రాఘవేంద్ర రావు ఒకరు. తెలుగు సినిమాలను కమర్షియల్ పేరామీటర్‌లో మరో రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకేంద్రుడు. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఇప్పుడు మరో అవతారం ఎత్తనున్నారట.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు కోవెలమూడి రాఘవేంద్రరావు నటుడిగా మారుతున్నారు. నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఓ సినిమాను డైరెక్ట్‌ చేయనున్నారట. ఇందులో రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో నటిస్తారట.

అలాగే, ఈ చిత్రంలో హీరోయిన్లుగా రమ్యకృష్ణ, సమంత, శ్రియ నటించనున్నట్లు వినికిడి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మరి నిజానిజాలేంటో తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0