పంజాబ్ ఆటగాళ్లపై ప్రీతి జింతా ముద్దుల వర్షం.. వీడియో వైరల్

ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ 5 గెలిచింది. మరో ఆరింటిలో ఓటమి పాలయింది. 10 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది కేఎల్ రాహుల్ సేన.
IPL 2020: ఐపీఎల్ టోర్నీ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న పంజాబ్ జట్టు.. ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ రేస్‌లో ఉంది. ఐతే శనివారం హైదరాబాద్ జట్టుపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది కేఎల్ రాహుల్ సేన. తక్కువ స్కోర్ చేయడంతో కింగ్స్ టీమ్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుంజుకొని హైదరాబాద్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది. కీలక సమయంలో.. లో స్కోర్‌ను కాపాడుకొని.. అద్భుత విజయం సాధించింది.
ఆఖరి వరకు సాగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలవడంతో.. ఆ జట్టు కో ఓనర్ ప్రీతి జింతా ఆనందానికి హద్దే లేకుండాపోయింది. హైదరాబాద్ టీమ్ పదో వికెట్ పడిన వెంటనే ఎగిరి గంతేసింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ సభ్యులకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
కరోనా కాలంలోనూ ప్రీతి జింతా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తూ.. ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తోంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తన హావభావాలతో అభిమానులను కూడా అలరిస్తోంది. టోర్నీ ఆరంభంలో ఇబ్బందులు పడినప్పుడు జట్టుకు అండగా ఉంది మనోధైర్యం నింపింది. ఇప్పుడు వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలవడంతో మేనేజ్మెంట్తో పాటు ఆటగాళ్లలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఆటగాళ్లను ప్రీతి జింతా ఎంకరేజ్ చేస్తున్న తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సొట్ట బుగ్గల సుందరి బెస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
కాగా, ఐపీఎల్ 2020 టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ 5 గెలిచింది. మరో ఆరింటిలో ఓటమి పాలయింది. 10 పాయింట్లతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది కేఎల్ రాహుల్ సేన. పంజాబ్ ఆడిన మొదటి ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన పంజాబ్.. ఆ తర్వాత నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటింది. జట్టులోకి క్రిస్ గేల్ వచ్చిన తర్వాత ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తోంది.