పవన్ తో సుదీప్ భేటీ


జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని ప్రముఖ నటులు, కన్నడ కథానాయకుడు సుదీప్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ వచ్చారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి మొక్కలు బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి సుదీప్ వివరించారు. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారు.

వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. ఆసక్తికర అంశం ఏమిటంటే… ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares