పామును ఫేస్ మాస్క్‌గా చుట్టుకొని బస్సులో ప్రయాణం

కరోనావైరస్ వ్యాప్తి నడుమ పామును ఫేస్ మాస్క్‌గా వేసుకొని ఓ వ్యక్తిని బస్సులో ప్రయాణించారు.
సోమవారం యూకేలోని మాంచెస్టర్ నుంచి స్వింటన్కు పామును మెడ చుట్టూ చుట్టుకొని ఆయన వచ్చారు.
”అదేదొ మాస్క్ అనుకొని మొదట భ్రమపడ్డాను. అయితే, భుజాల చుట్టూ తిరుగుతూ బుసలు కొట్టడంతో పామని తెలిసింది”అని తోటి ప్రయాణికుడు ఒకరు వివరించారు.
ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ మహిళ.. చాలా సరదగా అనిపించిందని వివరించారు. చుట్టుపక్కల ఎవరినీ పాము ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నారు. ”అందరూ షాక్‌లో చూస్తూ ఉండిపోయారు”.
ఇక్కడి ప్రభుత్వ రవాణా సదుపాయాలు ఉపయోగించేటప్పుడు ఫేస్ మాస్క్ తప్పనిసరి. కేవలం 11ఏళ్లలోపు పిల్లలు, ఇతర అనారోగ్యంతో ఉండేవారికి మాత్రమే ఇక్కడ మినహాయింపు ఉంటుంది.
”సర్జికల్ మాస్క్‌లు కాకుండా.. ప్రయాణికులు సొంత మాస్క్‌లు పెట్టుకోవాలని లేదా స్కార్ఫ్‌లు కట్టుకోవాలని ప్రభుత్వం సూచించింది”అని గ్రేటర్ మాంచెస్టర్ ట్రాన్స్పోర్ట్ అధికార ప్రతినిధి వివరించారు.
”పామును మాస్క్‌గా పెట్టుకోకూడదు. ఇది పాము చర్మంతో చేసిన మాస్క్ అని కొందరు చెప్పొచ్చు. అయితే పాము ఇంకా బతికే ఉందిగా’