ప్రముఖ నటుడు, రౌడీ షీటర్ దారుణ హత్య.. పూర్తి వివరాలు ఇవే..

ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సురేంద్ర బంట్వాల్ అనే కన్నడ నటుడిని అత్యంత దారుణంగా హత్య చేసారు. అయితే ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు రౌడీ షీటర్ కూడా. ఈయనపై ఇదివరకు చాలా పోలీస్ కేసులు ఉన్నాయి. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో కూడా సతమతం అవుతున్నట్లు తెలుస్తుంది. ఈయన్ని అక్టోబర్ 21న మధ్యాహ్నం దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బంట్వాల్‌లోని బస్తీపద్పులో జరిగింది. బీసీ రోడ్‌లోని తన అపార్ట్మెంట్లో అతనిపై దాడి జరిగింది. కన్నడలో ఈయన కొన్ని సినిమాలు చేసాడు. అందులో తులు, చాలీపొలిలు, సవర్ణ దీర్ఘా సంధి లాంటి సినిమాలు సురేంద్రకు గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ మధ్యే సురేంద్ర బంట్వాల్ కాంగ్రెస్‌లో చేరాడు. ఈయన హత్య కన్నడనాట సంచలనం రేపుతుంది. 2018లో బంట్వాల్ పట్టణంలో తన తల్వార్‌ను బ్రాండింగ్ చేయడంతో పాటు బిజేపీ కార్యకర్తలను బెదిరించడం వంటి వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.