ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే కంపెనీలివే

ఫిక్స్‌డ్ డిపాజిట్లకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. దీర్ఘకాలం, స్వల్పకాలమనే తేడా లేకుండా అత్యుత్తమ వడ్డీరేట్లను బ్యాంకులు అందిస్తుండటంతో చాలా మంది వీటిలో మదుపు చేస్తున్నారు. దేశంలోని చాలా కంపెనీలు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ప్రస్తుత వడ్డీ రేటు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ వడ్డీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టడానికి ముందు కంపెనీ ఎఫ్డీల్లో వచ్చే నష్టాలను అర్థం చేసుకోవాలని పెట్టుబడిదారులను ఫైనాన్షియల్ ప్లానర్స్ హెచ్చరిస్తున్నారు. కింద వివరించిన కంపెనీల్లో పీఎన్‌బీ హౌసింగ్, సుందరం హౌసింగ్ ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్, ఎల్ఐసీ హోం ఫైనాన్స్ సంస్థలకు ఇష్యూవర్లు రేటింగ్ ఇవ్వలేదు. మిగిలిన వాటికి రేటింగ్ పొందుపరిచారు. ఈ డేటా 2020 అక్టోబరు 01న ఇచ్చారు. ఇష్యూవర్లూ అందరూ 0.25 శాతం వృద్ధులకు ఇస్తుంది. శ్రీరాం ట్రాన్స్ పోర్టు కంపెనీ 0.40 శాతం, సుందరం హోం ఫైనాన్స్, సుందరం ఫైనాన్స్ సంస్థలు 0.50 శాతం అదనపు వడ్డీని వయోధికులకు ఇస్తున్నాయి.
కంపెనీ పేరు వడ్డీ రేటు కాల వ్యవధి 2020 జూలై నాటికి రేటింగ్ 2020 జూలై నాటికి ఇష్యూవర్ రేటింగ్
శ్రీరాం సిటీ యూనియన్ ఫైనాన్స్ 8.09 12 నెలల నుంచి 60 నెలలు MAA+ / Stable by ICRA and tAA by Ind-Ra Long term: IND AA/Negative Short term: IND A1+ by ind-Ra
శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ 8.09 12 నెలల నుంచి 60 నెలలు FAAA/Negative by CRISIL, MAA+/Stable by ICRA Long term: AA+/Negative and short term: A1+ by Ind-Ra
బజాజ్ ఫైనాన్స్ 6.88 12 నెలల నుంచి 60 నెలలు FAAA/Negative by CRISIL, MAAA/Stable by ICRA Long term BB+/stable and short-term B by S&P Global
పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్ 6.50 12 నెలల నుంచి 120 నెలలు CRISIL FAA+/Negative, AA/Stable by CARE Not Rated
సుందరం హోమ్ ఫైనాన్స్ 6.22 36 నెలల నుంచి 60 నెలలు FAAA/Stable by CRISIL, MAAA/Stable by ICRA Not Rated
సుందరం ఫైనాన్స్ 6.22 12 నెలల నుంచి 36 నెలలు FAAA/Stable by CRISIL Not Rated
హెచ్‌డీఎఫ్‌సీ 6.05 33 నెలల నుంచి 66 నెలలు FAAA/Stable by CRISIL, MAAA/Stable by ICRA AAA by CARE and AAA by ICRA
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ 6.00 12 నెలల నుంచి 60 నెలలు FAAA/Stable by CRISIL Not Rated
ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ 5.95 12 నెలల నుంచి 120 నెలలు FAAA/Stable by CRISIL, MAAA/Stable by ICRA and AAA by CARE AAA by ICRA
మహీంద్రా ఫైనాన్స్ 5.90 12 నెలల నుంచి 60 నెలలు FAAA/Stable by CRISIL Long term: IND AAA / Stable by Ind-Ra

కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా కార్పోరేట్ ఎఫ్డీలు ఇన్వెస్టర్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే ఇవి స్థిరమైన రాబడిని అందిస్తాయి. ఎఫ్డీలపై బ్యాంకులిచ్చే దానికంటే కొంచెం ఎక్కువ రిటర్నులను అందిస్తాయి. అయితే ఇదే సమయంలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా ఎఫ్డీల మాదిరిగానే కార్పోరేట్ ఎప్డీలపై వడ్డీ చెల్లింపు.. మీ ఆదాయపు పన్ను స్లాబ్ రేటుకు పూర్తిగా విధిస్తారు. కాబట్టి ఇది పోస్ట్ ట్యాక్స్ రిటర్న్ కారకంగా పనిచేస్తుంది.

కార్పోరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే హై రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల రిస్క్ తగ్గించుకోవచ్చు. సకాలంలో చెల్లింపు, భద్రతా స్థాయి బలంగా ఉందని ఏఏ రేటింగ్ ను సూచిస్తుంది. అధిక రేటింగ్ జారీ చేసేవారి మంచి సామర్థ్యంతో పాటు అలాగే అకాల విముక్తి నిబంధనలు కఠినంగా లేవని నిర్ధారించుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares