ఫ్రెంచ్‌ ఓపెన్‌లో చరిత్ర సృష్టించిన పొదరోస్కా!!

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మరో అనూహ్య ఫలితం వచ్చింది. 131వ ర్యాంకర్‌ నాడియా పొదరోస్కా (అర్జెంటీనా) ఐదో ర్యాంకు ప్లేయర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)పై క్వార్టర్స్‌లో గెలుపొందింది. దీంతో ఓపెన్‌ శకంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి మహిళా క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టించింది. పొదరోస్కా మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో 6-2, 6-4తో స్వితోలినాకు షాకిచ్చింది..

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మరో అనూహ్య ఫలితం వచ్చింది. 131వ ర్యాంకర్‌ నాడియా పొదరోస్కా (అర్జెంటీనా) ఐదో ర్యాంకు ప్లేయర్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌)పై క్వార్టర్స్‌లో గెలుపొందింది. దీంతో ఓపెన్‌ శకంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీఫైనల్‌ చేరిన తొలి మహిళా క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టించింది. పొదరోస్కా మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో 6-2, 6-4తో స్వితోలినాకు షాకిచ్చింది..

కెరీర్‌లో కేవలం రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడుతున్న 23 ఏళ్ల నాడియా పొదరోస్కా ఐదో ర్యాంకు స్వితోలినాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 13 బ్రేక్‌ అవకాశాలు సృష్టించుకున్న ఆమె.. ఎనిమిది సార్లు ప్రత్యర్థి సర్వీసును బ్రేక్‌ చేసింది. ఒకరి సర్వీస్‌లను మరొకరు బ్రేక్‌ చేసుకోవడంతో తొలి సెట్‌ ఆసక్తిగా సాగింది. మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన స్విటోలినా 1-0తో ఆధిక్యం సాధించింది. అయితే తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన పొదరోస్కా 1-1తో సమం చేసింది. మధ్యలో ఆధిక్యం చేతులు మారినా.. 8వ గేమ్‌లో స్విటోలినా సర్వీస్‌ను మరోసారి బ్రేక్‌ చేసిన నాడియా 6-2తో సెట్‌ను తన ఖాతాలో వేసుకొంది. రెండో సెట్‌లో రెచ్చిపోయిన పొదరోస్కా 6-4తో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకొంది.

ఇంతకుముందు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ డ్రాలో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గని నాడియా పొదరోస్కా.. ఈసారి ఏకంగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్‌గా టెన్నిస్‌ చరిత్రలో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌ చేరిన మూడో క్వాలిఫయింగ్‌ క్రీడాకారిణి పొదరోస్కా. గతంలో అలెగ్జాండ్రా స్టెవెన్సాన్‌ (1999లో వింబుల్డన్‌), క్రిస్టీనా డోరె (1978లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) ఈ ఘనత అందుకున్నారు.

మరోవైపు అన్‌సీడెడ్‌ కొలిన్స్‌ (అమెరికా) క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-4, 4-6, 6-4తో జబెర్‌ (ట్యునీసియా)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో పాబ్లో బుస్టా (స్పెయిన్‌) క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. నాలుగో రౌండ్లో అతడు 6-2, 7-5, 6-2తో ఆల్ట్‌మైర్‌ (జర్మనీ)ను ఓడించాడు. మూడో సీడ్‌ థీమ్‌ 6-7(1/7), 7-5, 7-6(8/6), 6-7(5/7), 2-6తేడాతో స్వార్జ్‌మన్‌ చేతిలో క్వార్టర్స్‌లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares