భారతీయుల గుండెల్లో మహాత్ముడి చెరగని ముద్ర, మనమే కాపాడుదాం, ప్రధాని మోదీ !

మహత్మాగాంధీ 151వ జయంతి సందర్బంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు, ప్రజలు జాతిపితకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. గాంధీ జయంతి సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రాజ్ ఘాట్ ను సందర్శించి మహత్మాగాంధీకి నివాళులు అర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భారతీయుల గుండెల్లో మహాత్ముడు చిరస్థాయిగా నిలిచిపోయారని, ఆయన ఆశయాలను మనమేకాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని భారతీయులు అందరూ ఈ రోజు మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈరోజు ప్రతి భారతీయుడు గర్వంగా తలఎత్తుకుని స్వతంత్రంగా జీవిస్తున్నారంటే మహత్మాగాంధీ చేసిన త్యాగాలే కారణం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. జాతిపిత మహాత్ముడి ఆశయాలు, ఆయన ఆలోచనలను, మనం కాపాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు గుర్తు చేశారు. మహాత్ముడికి స్వార్థం లేదు మహాత్ముడికి స్వార్థం లేదు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మహత్మాగాంధీ ఆయన ప్రాణాలు త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా శాంతియుతంగా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మహాత్మాగాంధీ స్వాతంత్ర సమరయోధులను ముందుండి నడిపించారని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే అందుకు ప్రధాన కారణం మహాత్మగాంధీ అనే విషయం నేటి యువత గుర్తు పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు సూచించారు .

గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీ సింపుల్ లైఫ్ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీ సింపుల్ లైఫ్ రాజ్ ఘాట్ కు వెళ్లే ముందే ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజయ్ ఘాట్ కు వెళ్లి లాల్ బహుదూర్ శాస్త్రీ పుణ్య సమాధి దగ్గర నివాళులు అర్పించారు. ఎలాంటి స్వార్థం లేకుండా లాల్ బహుదూర్ శాస్త్రీ భారతదేశానికి సేవలు చేశారని, ఆయన చాలా సాధారణ జీవితం గడిపారని ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని భారతీయులు అందరూ ఈ రోజు మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares