భారత్‌, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందం..


  • న్యూఢిల్లీ : భారత్‌, అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి మిలటరీ సాంకేతికత, ఉపగ్రహ డేటాతో పాటు ఇతరత్రా సైనిక పరమైన సమాచారాన్ని పంచుకునేందుకు ఈ ఒప్పందం అనుమతిస్తుది. ఈ మేరకు మౌలికాంశాల మార్పిడి- సహకార ఒప్పందం (బేసిక్‌ ఎక్స్ఛేంజ్‌ అండ్‌ కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ -బెకా)పై ఇరుదేశాల నేతలు మంగళవారం సంతకాలు చేశారు. భారత్‌ వైపు విదేశాంగ మంత్రి జైశంకర్‌, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు పాల్గొనగా, అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రక్షణ మంత్రి మార్క్‌ టి.ఎస్పర్‌లు చర్చలకు హాజరయ్యారు. బీఈసీఏ అనేది చాలా కాలం క్రితమే చర్చించిన ఒప్పందం. దానికి ఇప్పుడు తుదిరూపం ఇచ్చారు. వ్యూహాత్మ్క సంబంధాలు విస్తరించడానికి ఇందులోని అంశాలు చాలా కీలకం అయినందున ఇప్పుడు ఒప్పందం జరిగింది. ఇందులో కీలకమైనది 2002లో జరిగిన
    జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలటరీ ఇన్పర్మేషన్‌ అగ్రిమెంట్‌ (సాధారణ సైనిక సమాచార భద్రతా ఒప్పందం). దీనిలో భాగంగా అమెరికా నుంచి భారత్‌కు అందించిన సమాచారం యొక్క గోప్యత కోసం ఏర్పరచుకునే ప్రమాణాల గురించి ఉంటుంది. రెండవది 2016లో అమెరికా భారత దేశాన్ని ప్రధానమైన రక్షణ భాగస్వామిక హోదా కల్పించడం. దీనితో అమెరికా తన భాగస్వామ్యం దేశాలతో సమానహోదా భారత్‌కు కల్పించినట్టయింది. ఇప్పుడు భారత్‌తో రక్షణపరమైన వ్యాపారం, సాంకేతిక అంశాలు ఇవ్వడానికి వెసులుబాటు ఏర్పడింది. మూడవది అదీ 2016లో లాజిటిక్స్‌ ఎక్చ్సేంజ్‌ మోమోరాండం ఆప్‌ అగ్రిమెంట్‌ . దీనితో ఇరు దేశాల సైన్యాలు వారి స్థావరాలను మరమ్మతులు చేసుకునేందుకు, వారి సామాగ్రిని రవాణా చేసుకోవడానికి వినియోగించుకుంటాయి. దీనితో మరింత సహకారం ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఏర్పడినట్టు అయింది. నాలుగవది 2018 లో ‘కొమకాసా’ ఒప్పందం. దీనిలో ఇరుదేశాల సైన్యాలు ప్రత్యక్షంగా సమాచారం బదిలీ చేసుకోవచ్చు. అందుకు అవసరమైన అధునాతక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా భారత్‌కు అందజేస్తుంది. ఈ ఒప్పందంతో భారత అమెరికాకు ఒక జూనియర్‌ భాగస్వామిగా ధృడపడిపోయింది. ఒప్పందం జరిగిన తర్వాత మీడియాతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఈ ఒప్పందం చాలా కీలకమైనదన్నారు. రెండు దేశాల సైన్యాల సహాయ సహకారాలు ముందుకు సాగు తాయన్నారు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ భారత్‌కు ఎటువంటి ముప్పు, ఎవరి నుండి ఎదురైనా భారత్‌కు తాము బాసట గా ఉంటామని చైనా పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ గాల్వన్‌ లోయ ఘర్షణలను ఆయన పేర్కొన్నారు. ఆ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికులను తాము ఎంతగానో గౌరవిస్తామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares