మాఫియా డాన్ పాత్రలో ఎన్‌టీఆర్ కనిపించబోతున్నాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబోకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా కనిపించబోతున్నారని టాక్. అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకోవర్ కాబోతున్నారని తెలుస్తుంది.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను 300 కోట్లు ఖర్చు పెట్టి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారని, బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని, మిస్సైల్ అనే టైటిల్ ఈ సినిమాకు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నా ఎన్‌టీఆర్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నారు అని వార్త వినబడగానే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాలో, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో నటించబోతున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares