మిస్టర్,మిస్,మిసెస్ హైదరాబాద్ వేడుకలు ఎందరికో స్పూర్తి దాయకం-డైరెక్టర్ డా.ఆనంద్

హైదరబాద్ కు చెందిన ప్రముఖ మేగజైన్ సిటీ లైఫ్ చైర్మన్ మాక్ తారిక్,ఆని ప్రతి సంవత్సరం ఎంతో మంది మోడల్స్ ను ప్రోత్సహిస్తూ, మిస్టర్ మిస్, మిసెస్ హైదరాబాద్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.
అందులో భాగంగా హైదరాబాద్ లోని లే మెరీడియన్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమలో ప్రముఖ డాక్టర్,డైరెక్టర్,సామాజిక కార్యకర్త డా.ఆనంద్ పాల్గొని,విజేతలకు,నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి ట్వింకిల్ కపూర్ ముఖ్య అతిధిగా విచ్చేయగా,ఎన్నో కిరీటాలను సొంతం చేసుకున్న ప్రముఖ మోడల్స్ సుధా జైన్,డా.కల్పన, కృతిక శర్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
వి జె రాఖి ,ప్రియాంక శర్మ వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది.