మూట ముల్లె సర్దుకోనున్న కరాటే కళ్యాణి.. మరొకరు ఎవరు?


ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షో అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆదివారం ప్రసారం కానున్న కార్యక్రమంపై అమితాసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ జరుగనుంది. అందులో ఒకరు కరాటే కళ్యాణి కాగా, మరొకరు ఎవరన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నిజానికి భారీ అంచనాల మధ్య ప్రారంభమైన ఈ షో.. స్టార్ హీరో అక్కినేని నాగార్జున తన యాంకరింగ్‌తో మరింత రక్తికట్టిస్తూ, వీక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ, ఆసక్తికరంగా సాగిపోతోంది. శనివారం నాడు, హౌస్ మేట్స్‌తో మాట్లాడిన హోస్ట్ నాగార్జున, ఆదివారం ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారని చెప్పి, పెద్ద షాక్‌నే ఇచ్చారు.

అందులో ఒకరు కరాటే కల్యాణి అని ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోగా, రెండో వారు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వారం నామినేష‌న్స్‌లో 9 మంది పోటీదారులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

వీరిలో హౌస్ పార్టిసిపెంట్స్‌లో అత్యంత వృద్ధురాలైన గంగ‌వ్వ‌ను బిగ్ ‌బాస్ సేఫ్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నాగ్, మిగతా 8 మందిలో ఇద్దరు బయటకు రాబోతున్నారని, అందులో ఒకరు కల్యాణి అని కూడా చెప్పేశారు.

దీంతో టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వస్తున్న రెండో పోటీదారుగా కల్యాణి నిలిచింది. ఇక నేడు జరిగే ఎపిసోడ్‌లో మరొకరు కూడా బయటకు రానున్నారు. ఇదేసమయంలో ఇంటి సభ్యుల గురించి కల్యాణి ఏం చెబుతుందన్న విషయం కూడా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares