మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు..

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా అభిమానులు అంతా షాక్ అయ్యారు. ఇండస్ట్రీ కూడా ఇదే షాక్‌లోనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు..
మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా అభిమానులు అంతా షాక్ అయ్యారు. ఇండస్ట్రీ కూడా ఇదే షాక్‌లోనే ఉంది. నిన్నమొన్నటి వరకు బయట కనిపించిన మెగాస్టార్ ఉన్నట్లుండి కరోనా బారిన పడటంతో ఓ రకమైన షాక్‌లోకి వెళ్లిపోయారు. అయితే తనకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు చిరంజీవి. లక్షణాలు కూడా లేవని చెప్పుకొచ్చాడు చిరు. ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్యం కుదుటపడాలని.. కరోనా నుంచి క్షేమంగా బయట పడాలని మెగా అభిమానుల ఆధ్వర్యంలో నవంబర్ 10న ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా నుంచి కోలుకుని సంపూర్ణారోగ్యంతో మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని.. దేశ విదేశాల్లోని అభిమానులందర్నీ అలరించాలని కోరుతూ ప్రత్యేక పూజాలు నిర్వహిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని అఖిల భారత చిరంజీవి యువత విజ్ఞప్తి చేస్తుంది. మెగా అభిమానులందరూ
ఈ విజ్ఞప్తిని స్వీకరించి పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాం అంటూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు ఓ ప్రకటన విడుదల చేసాడు. ఆచార్య షూటింగ్ కోసం చిరు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. అందులో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన మాత్రమే కాదు ఇంకా చాలా మంది కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు.