యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి… స్క్రీన్ షాట్స్ వైరల్…

రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం..
ఓ యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి ఆమెను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వరుస కథనాలతో ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సదరు మంత్రి గారు ఓ యువతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశారని ఆ టీవీ ఛానెల్ పేర్కొంది. ఈ మేరకు తనకు సన్నిహితురాలైన ఓ మహిళతో తాను మనసుపడ్డ యువతిని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది. ఈ విషయంపై మంత్రి గారు తన సన్నిహితురాలితో జరిపిన వాట్సాప్ చాట్‌ను కూడా ఆ టీవీ చానెల్ బయటపెట్టింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం… ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం… టాలీవుడ్‌లో ఒకట్రెండు సినిమాల్లో నటించిన ఓ యువతిపై ఆ మంత్రి కన్ను పడింది. తన సన్నిహితురాలైన ఓ మహిళను రంగంలోకి దించి ఆ యువతిని ఒప్పించే ప్రయత్నం చేశారు. సదరు మహిళ ఆ యువతి ఫోన్ నంబర్ తెలుసుకుని ఆమెతో మాట్లాడింది. మంత్రి గారు మనసుపడ్డ విషయం చెప్పింది. అంతేకాదు,రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం ఉంటే మంచిదని ఉచిత సలహాలిచ్చింది. కానీ ఆ యువతి ఆమె ప్రతిపాదనకు అంగీకరించలేదు. సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు… ఆ యువతి నిరాకరించినప్పటికీ… సదరు మంత్రి గారు మాత్రం ఆమె కోసం ప్రయత్నాలు మానుకోలేదు. తన సన్నిహితురాలితోనే మళ్లీ ప్రయత్నాలు చేయించారు. ఈ క్రమంలో మంత్రి సన్నిహితురాలు ఆ యువతి వ్యక్తిగత ఫోటోలను తీసి ఆయనకు పంపించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ యువతి ఆమెతో గొడవకు దిగింది. ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కుని చూడగా… అందులో తన ఫోటోలు చూసి షాక్ తిన్నది. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా మంత్రి బాగోతాన్ని ఆమె బయటపెట్టింది. దీంతో ఆమె పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారాయి.

మంత్రి రాజీ ప్రయత్నాలు… ఆ యువతి తన బాగోతాన్ని బట్టబయలు చేయడంతో… సదరు మంత్రి ఆమెతో రాజీ ప్రయత్నాలు కూడా చేసినట్లు సదరు టీవీ చానెల్ వెల్లడించింది. దీనిపై ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఆరా తీశాయని… దీంతో ప్రభుత్వానికి సదరు మంత్రి వివరణ కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం ఆ మంత్రిపై గుర్రుగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మంత్రి ఎవరు.. ఏంటి అన్నది మాత్రం ఆ టీవీ చానెల్ వెల్లడించకపోవడం గమనార్హం.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0