యు ఎస్ ఓపెన్ సెమీస్ లో సెరెనా ఓట‌మి

Newyork: ఆరుసార్లు యూఎస్ ఓపెన్ ఛాంపియన్, అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్ సెమీ-ఫైనల్స్‌లో బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజారెంకా చేతిలో ఓడిపోయింది.

ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సెమీ-ఫైనల్స్‌లో అజరెంకా చేతిలో సెరెనా విలియమ్స్ 1-6, 6-3, 6-3 తేడాతో చిత్త‌యింది.

దాంతో సొంత గడ్డపై రికార్డు స్థాయిలో ఈ ఏడాది 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశాన్ని సెరెనా కోల్పోయింది.

అజారెంకా ఫైనల్లో జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకాతో శనివారం తలపడనుంది. అజారెంకా ఫైనల్‌కు చేరడం ఇది మూడవసారి.

అజారెంకా గతంలో రెండుసార్లు 2012, 2013 సంవత్సరాలలో సెరెనా చేతిలోనే ఫైనల్స్‌లో ఓడిపోయింది.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0