రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు

దాడులు, కేసుపై సీబీఐ కీలక ప్రకటన – ఎవరూ మిస్ కావొద్దని ట్వీట్

భారీ ఎత్తున బ్యాంకు రుణాలను ఎగవేసిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు ప్రమేయం నిజమేనని తేలింది. బ్యాంకు మోసాలపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ.. గురువారం ఉదయం నుంచి హైదరాబాద్‌, ముంబైలోని ఆయన నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించగా.. సదరు వార్తలను ఎంపీ తోసిపుచ్చారు. తన ఇళ్లు, కంపెనీలపై దాడులు వట్టి ప్రచారమేనని చెప్పుకొచ్చారు. దీంతో కొద్ది గంటలపాటు గందరగోళం ఏర్పడింది. కానీ చివరికి సీబీఐ అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఎంపీ అడ్డంగా దొరికిపోయినట్లయింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఆధ్వర్యంలోని బ్యాంకుల కానార్టియం నుంచి రూ.826 కోట్ల రుణం తీసుకుని, దాన్ని తిరిగి చెల్లించకుండా ఎంపీ రఘురామకృష్ణంరాజు మోసానికి పాల్పడ్డారని, రుణాల ఎగవేత వ్యవహారంలో ఎంపీకి చెందిన ఇండ్-భారత్ సంస్థ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై గురువారం సోదాలు జరిగాయి. అయితే, తన ఇంట్లో ఎలాంటి సీబీఐ సోదాలు జరగలేదని, ఆ విషయాలను మీడియా ద్వారానే తెలుసుకున్నానని, తనిఖీలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, అసలీ సోదాల విషయం బయటికి ఎలా వచ్చిందో అర్థం కావడంలేదని రఘురామ వ్యాఖ్యానించారు. కానీ ఆయనీ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే దాడులు, కేసులకు సంబంధించి సీబీఐ అధికారిక ప్రకటన చేసింది.

బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేశామని, మొత్తం 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు గురువారం రాత్రి మీడియాకు ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఆయన కంపెనీలు రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందిందని సీబీఐ ప్రెస్ నోట్ లో పేర్కొంది. అంతేకాదు.. ఎంపీ భార్యపైనా చీటింగ్ కేసు ఎంపీ భార్యపైనా చీటింగ్ కేసు ఎంపీ రఘురామకు చెందిన ఇండ్-భారత్ కంపెనీ.. బ్యాంకుల నుంచి నిధులు పొంది.. వాటిని దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు కూడా సీబీఐ అభియోగాలు మోపింది. దర్యాప్తులో భాగంగానే హైదరాబాద్, ముంబై, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 11 ప్రదేశాల్లో గురువారం సోదాలు నిర్వహించామని, కంపెనీ కార్యాలయాలు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాలపై సోదాలు జరిపినట్లు ప్రెస్‌నోట్‌లో సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎంపీ రఘురామతోపాటు ఆయన భార్య రమాదేవి, కూతురు కోటగిరి ఇందిరా ప్రియదర్శిని, బొప్పన సౌజన్య, వడ్లమాని సత్యనారాయణరావు, విస్రాప్రగడ పేర్రాజు, గోపాలన్ మనోహరన్‌, కె.సీతారామ, భాగవతుల ప్రసాద్‌, నంబూరి కుమారస్వామిలపై సీబీఐ సీబీఐ చీటింగ్‌ కేసు నమోదు చేసింది.

సోదాలు! సీబీఐ దాడులు తొలిసారి కాదు.. సీబీఐ దాడులు తొలిసారి కాదు.. 2019 ఏప్రిల్‌ 30న బ్యాంక్‌ లోన్‌ బకాయిలు పడిన కేసులో సైతం హైదరాబాద్‌, భీమవరంలోని రఘురామకృష్ణంరాజు కంపెనీల్లో సోదాలు చేపట్టారు. వివిధ ప్రాజెక్ట్‌లకు సంబంధించి రూ.600 కోట్ల మేర ఆయన రుణాలు తీసుకున్నారు. ఇక ఇండ్‌-భారత్‌ పవర్‌ లిమిటెడ్‌కు సంబంధించి రూ.947 కోట్ల మేర బ్యాంకులకు రుణాలు ఎగ్గవేయగా, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూట్ల నుంచి రూ.2655 కోట్ల మేర రఘురామ రుణం తీసుకున్నారు. ఈ సోదాల్లో 11 నుంచి 14 సీబీఐ బృందాలు పాల్గొన్నట్టు సమాచారం. బ్యాంకులకు ఎగవేతపై రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా సీబీఐ కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares