రాహుల్ గాంధీలో ఆ లక్షణం లేదు..బరాక్ ఒబామా !

రాహుల్ గాంధీలో ఆ లక్షణం లేదు.. యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాజకీయ పరిపక్వత లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి బ్యాడ్ టైం కొనసాగుతున్నది. ఆయన ఎక్కడికెళ్లినా అక్కడ ఓటములే పలకరించడంతో చాలామంది ఆయన పనైపోయిందని అంటున్నారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరిపక్వత చెందిన రాజకీయ నాయకుడు కాదంటూ పేర్కొన్నారు. ఆయన ఇటీవలే రాసిన తన ఆత్మకథ.. ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒబామా.. తన పుస్తకంలో ఒక్క రాహుల్ గాంధీ గురించే కాదు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన ఈ పుస్తకంలో మరికొందరు దేశాధినేతలు, వారితో తన పని తీరును గురించి రాసుకొచ్చాడు ఒబామా.

ఎ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. ‘రాహుల్ గాంధీ నర్వస్డ్ గా ఉన్నారు. ఆయనలో ఒక తెలియని లక్షణం ఉంది. ఏదైనా కోర్సు చేసే విద్యార్థి.. తన ఉపాధ్యాయుడిని ఆకట్టుకోవడానికి ఆత్రుతగా ఉన్నట్టు కనబడతాడు. కానీ లోతుగా విషయాలను అవగాహన చేసుకునే గుణం.. ఆ పట్టుదల అతడిలో కనిపించడం లేదు… ’ అంటూ రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

అంతేగాక మన్మోహన్ గురించి పేర్కొంటూ.. ‘మన్మోహన్ సింగ్ ఒక అస్పష్టమైన చిత్తశుద్ధిని కలిగి ఉన్నారు. అమెరికాలో రక్షణ శాఖ కార్యదర్శి బాబ్ గేట్స్ కూడా ఇలాంటి వారే..’ అంటూ రాశారు. వీరిరువురే గాక ఒబామా.. తాజాగా యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, బిన్ లాడెన్ మరణం సమయంలో దారితీసిన పరిస్థితులను వివరిస్తూ రాశాడు.బిడెన్ గురించి ప్రస్తావిస్తూ.. తనకంటే సీనియర్ అయినా ఆయన అలా వ్యవహరించలేదని.. చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. కాగా.. ఈ పుస్తకంలో ఆయన తన వ్యక్తిగత జీవితం కంటే ప్రపంచ దేశాలతో రాజకీయాంశాలే ఎక్కువగా స్పురించారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొన్నది. పాకిస్థాన్ లో అబోటాబాద్ లో బిన్ లాడెన్ ను మట్టుబెట్టే సమయంలో ఆయన వ్యవహరించిన తీరు.. ప్రపంచ దేశాలతో అమెరికా మైత్రి అనే విషయాలను ఎక్కువగా స్పురించారు. డెమొక్రాట్ అయిన ఒబామా.. తాజాగా ఎన్నికైన బిడెన్ కు తన మద్దతు ప్రకటించిన విషయం విదితమే. ఒబామా గతంలోనూ ‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’, ‘ది అడాసిటీ ఆఫ్ హోప్’ ‘ఛేంజ్ వి కెన్ బిలీవ్ ఇన్’ వంటి పుస్తకాలను కూడా రాశారు. కాగా ఒబామా తాజా పుస్తకం ఎ ప్రామిస్డ్ ల్యాండ్ ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0