రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం

రోజువారీ కొత్త కేసులు, మరణాలలో భారత్‌ అగ్రస్థానం – ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
సెప్టెంబర్ ఆరంభం నుంచి భారత్ లో రోజుకు సుమారు వెయ్యిమంది కోవిడ్-19తో చనిపోతున్నారు

భారత్‌లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్లడించింది. అమెరికా, బ్రెజిల్‌తోపాటు భారతదేశంలో రోజువారీ కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయని WHO తెలిపింది.

గత 24 గంటలలో ప్రపంచవ్యాప్తంగా 307,930 కేసులు నమోదయ్యాయని, ఇది ఒకే రోజు అత్యధిక కేసులలో ఒక రికార్డని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 5,500మంది మరణించారని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 917,417 చేరుకున్నట్లు WHO తెలిపింది.

అత్యధిక కేసులు నమోదు చేస్తున్న దేశాలలో భారత్‌, అమెరికా, బ్రెజిల్‌లు అన్నిదేశాలకన్నా ముందు వరసలో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 2.8 కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, అందులో సగం కేసులు అమెరికాలోనే ఉన్నాయి.

సెప్టెంబర్‌ 6న చివరిసారిగా అత్యధిక సంఖ్యలో 306,857 కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కేసులు ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలనుబట్టి ఆదివారంనాడు భారతదేశంలో 94,372 కొత్త కేసులు నమోదుకాగా, అమెరికాలో 45,523, బ్రెజిల్‌లో 43,718 కేసులు రికార్డయ్యాయి.

గత 24 గంటల్లో భారత్‌, అమెరికాలో వెయ్యి మరణాలు నమోదుకాగా, బ్రెజిల్‌లో 874మంది చనిపోయారు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో భారత్‌ రెండోస్థానంలో నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే భారత్‌లో 20లక్షల పాజిటివ్‌ కేసులు రిపోర్టయ్యాయి.

మహమ్మారి ప్రభావం చూపడం మొదలు పెట్టిన తర్వాత ఒక నెలలో ఇదే అత్యధిక కేసుల సంఖ్య.

సెప్టెంబర్ ప్రారంభం నుంచి భారత్‌లో రోజూ వెయ్యిమంది కోవిడ్‌ కారణంగా చనిపోతుండగా, జులై నెలలో రోజుకు 84శాతంవృద్ధితో, 64,000 కేసులు రికార్డయ్యాయని అధికారిక రిపోర్టులు చెబుతున్నాయి.

బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా కేసులు రికార్డయ్యాయి. దీంతో ఆ దేశం కేసుల నమోదులో ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 131,000 మంది మరణించారు.

ఇక అమెరికా విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో పావువంతు కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆ దేశంలో దాదాపు 6 కోట్లమంది వైరస్‌ పీడితులయ్యారు. జులైలో అత్యధికంగా కేసులు వచ్చినా, ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టింది.

ప్రపంచ మరణాలలో అమెరికా అందరికంటే ముందుంది. సుమారు 194,000మంది ఆ దేశంలో మరణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares