వకీల్ సాబ్ సెట్‌లో ‘బొమ్మ అదిరింది’.. పవన్ కళ్యాణ్‌ను కలిసిన జానీ మాస్టర్, శ్రీముఖి!!


బొమ్మ అదిరింది టీం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వకీల్ సాబ్ సెట్‌లో పవన్ కళ్యాణ్ కలిసిన శ్రీముఖి జానీ మాస్టర్ గల్లీబాయ్స్ ఫేమ్ రియాజ్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ మీటింగ్ వెనుకున్నది నాగబాబు అని తెలుస్తోంది. బొమ్మ అదిరింది టీం అంటే నాగబాబు.. నాగబాబు అంటే బొమ్మ అదిరింది టీం. ఇలా పవన్ కళ్యాణ్‌ను కలవడం వెనుక ఉన్న కారణాలు మాత్రం తెలియడం లేదు.

అదిరింది షో కాస్తా బొమ్మ అదిరిందిగా మారింది. ఆ మార్పులోనే శ్రీముఖి యాంకర్‌గా, జడ్జ్‌గా జానీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి ఎపిసోడ్‌లోనే ఇమిటేషన్‌లతో నానా హంగామా చేసి రచ్చ రచ్చ చేశారు. అలా బొమ్మ అదిరింది బాగా క్లిక్ అయింది. నాగబాబు ఆధ్వర్యంలో బొమ్మ అదిరింది బాగానే నడుస్తోంది.

చాలా నెలల తరువాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సెట్‌లో అడుగుపెట్టాడు. సెట్‌లోని స్టిల్స్, వీడియోలు, ఫోటోలు లీక్ కావొద్దని కఠిన చర్యలే తీసుకుంటున్నారు. అయితే నిన్న ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ తన గడ్డాన్ని తీసేసి.. జుట్టను కత్తిరించుకున్నాడు.

శ్రీముఖి తాజాగా పవన్ కళ్యాణ్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ ఫుల్ ఎగ్జైట్ అయింది. ఇంతకంటే ఎక్కువగా టైప్ చేయలేకపోతోన్నా.. లవ్ లవ్ లవ్ అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ లుక్ తెగ వైరల్ అవుతోంది.

జానీ మాస్టర్, గల్లీ బాయ్స్ టీం సభ్యుడు రియాజ్ పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే వీరంతా సినిమా కోసం కలిశారా? లేదా? మామూలుగానే కలిశారా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజకీయాలు మరో వైపు వరుస చిత్రాలు ఊపిరిసలపనివ్వడం లేదు. వకీల్ సాబ్ అయిపోయిన వెంటనే క్రిష్ సినిమా.. అది లైన్‌లో ఉండగానే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ కూడా చేయనున్నాడు. అవి కాకుండానే బండ్ల గణేష్‌తో ఒకటి.. సితారా ఎంటర్టైన్మెంట్స్‌లో మరొకటి కమిట్ అయ్యాడు.

Share and Enjoy !

0Shares
0 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

0Shares
0