వరద బాధితుల పేరుతో బురద రాజకీయాలు, సీఎం జగన్‌పై లోకేశ్ విసుర్లు..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విరుచుకుపడ్డారు. వరద బాధితుల పేరుతో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆపదలో ఉంటే ప్రజలను ఆదుకోవాలే తప్ప.. చులకన చేయొద్దన్నారు. ఆపన్నహస్తం కోసం చూస్తోన్న జనానికి చేయూతనివ్వాలని కోరారు. అదీ మానీ.. విపక్షాలపై విరుచుకుపడటం సరికాదన్నారు. ఇకనైనా సీఎం జగన్, మంత్రులు తీరు మార్చుకోవాలని సూచించారు. వరదతో లంక గ్రామాలుు మునిగాయని.. దీంతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని లోకేశ్ పేర్కొన్నారు. వర్షం, వరదతో కంది, పసుపు, పత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు నష్టపోయారని చెప్పారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని నారా లోకేశ్ తెలిపారు. కానీ వారిని ఆదుకోవడం మాని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. జగన్, మంత్రులు చేస్తోన్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెబుతారని తెలిపారు. కానీ తమకేం జరగదని, 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని అహంకారపూరితంగా వ్యవహరించడం సరికాదని నారా లోకేశ్ హితవు పలికారు.

వరద బాధితులను ప్రభుత్వం మోసం చేస్తోందని లోకేశ్ విమర్శించారు. నష్ట పరిహారం అంచనా, నష్ట పరిహారం బాగుందన్నారు. కానీ అదీ పేపర్లలో తప్ప… క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం లేదన్నారు. వరద వచ్చి ఇన్నిరోజులవుతున్నా అంచనాలు వేయడం ఎందుకు పూర్తవడం లేదు అని లోకేశ్ ప్రశ్నించారు. రైతులకు పరిహారం అందించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రతీది రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తీరు మార్చుకోవాలని.. అన్నదాతలను ఆదుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares