విజయ్ దేవరకొండతో అనుష్క తాజా చిత్రం ??

అర్జున్ రెడ్డితో దేవసేన..?

బాహుబలి దేవసేన అనుష్క తాజా చిత్రం నిశ్శబ్ధం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్టోబర్ 2న ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాధవన్ కీలక పాత్రలో నటించారు. భాగమతి తర్వాత అనుష్క కొంత గ్యాప్ తీసుకుంది. అనుష్క ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది.

అయితే ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే రెండు సినిమాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది. వీటిలో ఓ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నారట.

డెబ్యూ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన అనుష్క-విజయ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఇక విజయ్ ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నా‌థ్‌తో సినిమా చేస్తున్నాడు. ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆపై అనుష్కతో కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమౌతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Shares